తెలుగు బిగ్‌బాస్ సీజన్ 2 నుండి మొదటి నుండి ఏదో ఒక విషయంలో విమర్శలు వస్తూనే ఉన్నాయి.తాజాగా శనివారం ఎపిసోడ్లో పలువురు ఇంటి సభ్యులను నాని ఏకేస్తాడని అంతా అనుకున్నారు.
ముఖ్యంగా బాబు గోగినేని తీరుపై నాని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తాడని, ఆయన కౌశల్ మరియు గీతామాధురిని ఇంటి నుండి బయటకు పంపిస్తాను అంటూ చేసిన వ్యాఖ్యల వీడియోను అందరి ముందు ప్రసారం చేసి, ఆయన్ను ఓ రేంజ్లో దుమ్ము దులపాలని అంతా భావించారు.కాని అనూహ్యంగా నాని మాత్రం సో సోగానే విమర్శలు చేసి వదిలేశాడు.
ఇక తనీష్ విషయంలో మరోసారి నాని సాఫ్ట్ కార్నర్‌ను చూపించాడు.

బిగ్‌బాస్ ఇంట్లో అంతా సమానమే, ఇంటి పనులు అంతా కలిసి చేసుకోవాలి.బిగ్‌బాస్ ఇంటికి కెప్టెన్ ఉంటాడు.ఆ కెప్టెన్ చెప్పినట్లుగా అంతా వినాల్సి ఉంటుంది.
కాని అలా ఇంట్లో జరగడం లేదు.అయినా కూడా నాని ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
గత సీజన్లో ఎన్టీఆర్ చాలా యాక్టివ్‌గా హోస్టింగ్ చేసేవాడు.తన సొంత నిర్ణయాలను తీసుకుంటూ, తన ముద్ర వేసేందుకు ప్రయత్నించాడు.
కాని నాని మాత్రం సొంత తెలివి తేటలను వినియోగించడం లేదు.షో నిర్వాహకులు ఎలా చెబితే అలా బయటకు చెప్పేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక కౌషల్‌పై కొందరు విమర్శలు, కొందరు అభిమానంను కురిపిస్తున్న నేపథ్యంలో నాని ఆయన విషయంలో ఒక క్లారిటీగా మాట్లాడలేక పోయారు.ఆయన్ను ఒక విషయంలో విమర్శించాలని నాని భావించినా కూడా కౌశల్ ఆర్మీకి భయపడి వెనుకంజ వేసినట్లుగా అనిపించింది.కౌశల్‌ను వెనకేసుకు వస్తున్నట్లుగా అనిపించింది, అదే సమయంలో ఆయన్ను విమర్శించినట్లుగా కూడా అనిపించింది.మరో వైపు నాని ఇతర ఇంటి సభ్యుల విషయంలో కూడా ఏమాత్రం కఠువుగా స్పందిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.
హిందీ బిగ్‌బాస్ హోస్ట్ సల్మాన్ ఖాన్‌ను చూసి నాని చాలా నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు.బాబు గోగినేని తీరుపై నాని సరిగా స్పందించలేదని, ఆయనపై కఠినంగా వ్యవహరించి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి బాబు గోగినేనిపై నాని చూపించిన సాఫ్ట్ కార్నర్ ఆయన్ను సోషల్ మీడియాలో టార్గెట్ చేసేలా చేసింది.మొత్తంగా నాని హోస్టింగ్పైనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.







