ఎక్కువై కొట్టుకుంటున్నారు ! టికెట్ల కోసం ఇక్కట్లు ! టీఆర్ఎస్ లో భగ్గుమంటున్న విబేధాలు !

మంది ఎక్కువ ఈత్తె మజ్జిగ పలచన అనే సామెత ఇప్పుడు తెలంగాణ అధికార పార్టీ కి సరిగ్గా సరిపోతోంది.పార్టీలో ఇప్పటికే లెక్కకు మించి నేతలు ఉండడంతో కార్ ఓవర్ లోడ్ అయ్యి ముందుకు వెళ్లాలన్న వెనక్కి వెళ్లాలన్న తెగ ఇబ్బంది పడిపోతోంది.

 Group Politics In Trs Party-TeluguStop.com

అప్పట్లో ప్రతిపక్ష పార్టీలను బలహీన పరిచే క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నాయకులను పార్టీలోకి చేర్చేసుకున్నారు.అందులో నియోజకవర్గ స్థాయి నాయకులకు అయితే ఏకంగా టికెట్ హామీలు కూడా గుప్పించేసారు.

అయితే ఇప్పడు వారంతా ఎమ్యెల్యే టికెట్ల కోసం లొల్లి మొదలెట్టేసారు.అంతే కాదు ఎవరికీ వారు గ్రూప్ రాజకీయాలు మొదలుపెట్టి పార్టీని తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు.

ఒకే నియోజక వర్గంపై ఎక్కువమంది నేతలు ఆశ పెట్టు కోవడంతో అసలు సమస్య మొదలయ్యింది.మొదటి నుంచి ఆ టిక్కెట్ కోసం కష్టపడి కసరత్తు చేసుకున్న నేతలు చివరి నిమిషంలో ఎవరైనా తన్నుకుపోతారా అన్న సందేహంలో సతమతమవుతున్నారు.తమ నియోజక వర్గంలో మరొకరు వేలు పెట్టకుండా రకరకాలుగా జాగ్రత్తలు పడుతున్నారు.టికెట్ ఎవ‌రికి ద‌క్కుతుందో తెలియ‌దు కాని ఆశావ‌హులు మాత్రం ఇప్పటి నుంచే నియోజ‌క‌వ‌ర్గంలో త‌మ ఉనికిని చాటుకునేందుకు నానా తంటాలూ పడుతున్నారు దీంతో సిట్టింగ్ లు, ఆశావాహుల మధ్య కోల్డ్ వార్ బయట పడుతోంది తెలంగాణ లో కొన్ని జిల్లాల్లో ఈ తరహా వార్ ఎక్కువగా ఉంది.

స్టేషన్ ఘన్ పూర్ నియోజక వర్గంపై కన్నేసిన డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి కూతురు కావ్యపై సిట్టింగ్ ఎమ్మెల్యే రాజ‌య్య మండిపడుతున్నారు.కావ్యకు అస‌లు త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటు హ‌క్కే లేద‌ని చెప్పారు.వ‌రంగ‌ల్ ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే కొండా సురేఖ, మేయ‌ర్ న‌న్నప‌నేని న‌రేంద‌ర్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణ‌ం కనిపిస్తోంది.మ‌హ‌బూబాబాద్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్‌ మాజీ ఎమ్మెల్యే క‌విత‌ల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భగ్గుమంటోంది.

భూపాల ప‌ల్లి నియోజ‌కవ‌ర్గంలో స్పీకర్ మ‌ధు సూధ‌నా చారి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఈ నియోజ‌క‌ వ‌ర్గంనుంచి త‌మ కూతురు కొండా సుస్మిత ను రంగంలోకి దించాలని సురేఖ భావిస్తున్నారు.అయితే మధుసూదనాచారి ఇవేం పట్టించుకోకుండా పల్లెనిద్రల పేరుతో నియోజక వర్గంలోనే ఉంటూ పర్యటిస్తున్నారు దీంతో సురేఖ మధుసూదనా చారిని టార్గెట్ చేశారు.

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం లో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావుకు సంబంధం లేకుండా ఏకంగా తెలంగాణ ఉద్యమ‌కారుల కార్యాల‌యం పేరుతో టీఆర్ఎస్ నేత‌లే ఆఫీస్ తెరిచారు.గ‌తంలో ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా అధ్యక్షుడిగా ప‌నిచేసిన త‌క్కెళ్ల ప‌ల్లి రవీంద‌ర్ రావే ఈ కార్యాల‌యంను ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది.భద్రాద్రి కొత్త గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట్రావు కు పోటీగా ఉట్కూరి గోపాల్ రావు ప్రజలకు దగ్గరవుతున్నారు ఉట్కూరి ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ‌ర్గానికి చెందిన నేత కావ‌టంతో ఇద్దరు నేత‌ల మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భగ్గుమంటోంది.

న‌ల్లగొండ జిల్లా హుజూర్ న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంకోసం పోటీ రసవత్తరంగా మారుతోంది.

ఇక్కడ గతంలో పోటీ చేసి ఓడిపోయిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, ఓ వైపు, ఎన్ ఆర్ ఐ సైదిరెడ్డి మరోవైపు ఈ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.సైదిరెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి అండదండలున్నాయన్నది శంకరమ్మ ఆరోపణ.

కోదాడ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే వేనేప‌ల్లి చంద‌ర్ రావు, గ‌త ఎన్నిక‌ల్లో ఓటమి పాలైన శ‌శిధ‌ర్ రెడ్డిల మ‌ధ్య సఖ్యత లేదు.తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంపై సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తెలంగాణ జాగృతి ఉపాధాక్షుడు మేడె రాజీవ్ సాగ‌ర్ ల మ‌ధ్య పోటా పోటీ నెల‌కొంది.

మంత్రి కేటీఆర్ పర్యటనలో రాజీవ్ సాగ‌ర్ ఫ్లెక్సీలు పెట్టడాన్ని ఎమ్మెల్యే కిషోర్ తీవ్రంగా వ్యతిరేకించి వాటిని తొలగించడం వివాదంగా మారింది.

ఉమ్మడి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలోని కొడంగ‌ల్ సీటుకోసం ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది న‌రేంద‌ర్ రెడ్డికి టికెట్ ఇస్తే తిరుగుబాటు చేసేందుకు గుర్నాథ్ రెడ్డి సిద్ధ మవుతున్నారన్న ప్రచారం ఉంది.

అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహీం చేరికను మందా జగన్నాథమ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.పాత ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్‌, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మ‌ధ్య విభేదాలు ముదిరి పోలీస్ స్టేష‌న్ ల‌లో కేసులు వేసుకునే వ‌ర‌కు వెళ్ళాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube