శ్రీనివాస కళ్యాణం సాయి పల్లవితో అయితే బాగుండేది

నితిన్‌ హీరోగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.ఆగస్టులో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో నితిన్‌కు జోడీగా రాశిఖన్నా నటించిన విషయం తెల్సిందే.

 Raashi Khanna Replaces Sai Pallavi In Nithins Film-TeluguStop.com

ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు పోస్టర్స్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.షూటింగ్‌ ప్రారంభం అయిన రోజే నితిన్‌ మరియు రాశిఖన్నాల లుక్‌ను రివీల్‌ చేశారు.

పెళ్లి డ్రస్‌లలో ఉన్న వీరిద్దరు సినిమాపై అంచనాలను పెంచేశారు.నితిన్‌, రాశిఖన్నా అచ్చు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉన్నట్లుగా ఉన్నారు అంటూ ప్రశంసలు దక్కాయి.

ఈ చిత్రంలో రాశిఖన్నాకు ముందు సాయి పల్లవిని ఎంపిక చేయాలని దిల్‌రాజు భావించాడు.‘శతమానంభవతి’ చిత్రంలో హీరోయిన్‌గా అనుపమ పరమేశ్వరన్‌ ఎలా అయితే ఆకట్టుకుందో ఈ చిత్రంలో కూడా సాయి పల్లవి అయితే అన్ని విధాలుగా సూట్‌ అవుతుందని దిల్‌రాజు మరియు దర్శకుడు సతీష్‌ వేగేశ్న భావించారు.

కాని అనూహ్యంగా సాయి పల్లవి ఈ చిత్రంలో నటించేందుకు నో చెప్పింది.అందుకు ముందు దిల్‌రాజు బ్యానర్‌లో ‘ఫిదా’ మరియు ‘ఎంసీఏ’ చిత్రాలకు వర్క్‌ చేసిన సాయి పల్లవి ఈ చిత్రంలో అదనపు పారితోషికం ఇస్తాము అంటూ ఆఫర్‌ చేసినా కూడా నో చెప్పింది.

సాయి పల్లవి నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రలను మాత్రమే చేసేందుకు ఆసక్తి చూపుతుంది.మొదటి నుండి కూడా ఈమె గ్లామర్‌కు నో అంటూ నటనపై ఎక్కువ ఫోకస్‌ పెడుతుంది.కాని శ్రీనివాస కళ్యాణం చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేదు.ఇక నానితో చేసిన ఎంసీఏ చిత్రంలో సాయి ప్లవి నటించిన విషయం తెల్సిందే.ఆ చిత్రంలో సాయి పల్లవి పాత్రను మొదట ఎక్కువ చెప్పి, ఆ తర్వాత తగ్గించారు.దిల్‌రాజుపై నమ్మకంతో ఆ సినిమాను చేస్తే మోసం చేశారు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రంలో చెప్పడమే హీరోయిన్‌ పాత్రకు ప్రాముఖ్యత తక్కువ ఉంటుందని చెప్పారట.దాంతో ఆమె నో చెప్పింది.ఒక వేళ నితిన్‌కు జోడీగా శ్రీనివాస కళ్యాణంలో సాయి పల్లవి నటించి ఉంటే సినిమా స్థాయి మరింతగా పెరిగేది అని, రాశిఖన్నా వల్ల కాస్త సినిమాకు క్రేజ్‌ తగ్గిందనే టాక్‌ వినిపిస్తుంది.సినిమా విడుదలైన తర్వాత సాయి పల్లవి ఈ చిత్రాన్ని కాదనుకుని తప్పు చేసిందా లేదంటే ఒప్పు చేసిందా అనేది తేలిపోనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube