ఏపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ..? బీజేపీ ప్రతీకారం !

కేంద్రం పై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడం .అది వీగిపోవడం .

 No Confidence Motion On Ap Govt Ram Madhav-TeluguStop.com

దేశవ్యాప్తంగా ఇది పెద్ద చర్చకు తెరతీయడం… బీజేపీ పరువు పోవడం ఇవన్నీ చక చక జరిగిపోయాయి.అదీ కాకుండా మిగతా రాష్ట్రాలకంటే ఏపీకి ఎక్కువ నిధులు ఇచ్చినా బీజేపీ మోసం చేసిందన్న ఆరోపణలు టీడీపీ తరుచూ చేస్తుండడం బీజేపీకి చికాకు తెప్పిస్తోంది.

అందుకే ఇప్పుడు చంద్రబాబు ని టార్గెట్ చేసుకుని ఆయన్ను అన్నివిధాలా ఇబ్బంది పెట్టాలని చూస్తోంది.దానిలో భాగంగా ఏపీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పావులు కదుపుతోంది.

బీజేపీ అగ్ర నాయకుల మాటలను ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్ తన నోటి వెంట పలకడం అనేక అనుమానాలు కలిగిస్తోంది.

ప్రస్తుతం టీడీపీ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఆ పార్టీ విమర్శలకు, రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని చెప్పారు.టీడీపీ, కాంగ్రెస్ ల స్నేహ బంధానికి లోక్ సభ వేదికగా నిలిచిందని అన్నారు.

వైసీపీ సహకరిస్తే, టీడీపీపై అవిశ్వాసం పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పుకొచ్చారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు అన్ని టీడీపీ తన సొంత ఖాతాలో వేసుకొని రాజధాని ని నిర్మించకుండా సింగపూర్ లో దాచుకున్నాడు, అది తెలిసి ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో ఇప్పుడు తప్పంతా కేంద్రానిదే అని బీజేపీపై బురద జల్లే ప్రయత్నాలు మొదలబెట్టాడని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.లోక్ సభలో అవకాశం ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని, సభా మర్యాద తెలియకుండా పాలకులు ఎలా అయ్యారని అన్నారు మాధవ్.

టీడీపీ, కాంగ్రెస్ స్నేహానికి లోక్ సభ వేదికైంది.

రాజీనామాలు చేసిన వైసీపీ లోక్ సభలో అవిశ్వాసం అప్పుడు లేకుండా పోయిందని మాధవ్ అన్నారు.ప్రజలు ఎన్నుకుంటే రాజీనామాలు చేసి ఆందోళనలు చేయటం సరికాదన్నారు.

అయితే కేంద్రంలో అవిశ్వాసం ఎలా అయితే వీగిపోయిందో .ఏపీలో కూడా అవిశ్వాసం అలాగే వీగిపోతుంది ఈ విషయం తెలిసినా అవిశ్వాసం పెడతాము అని చెప్పడం వెనుక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యూహం ఉన్నట్టుగా అర్ధం అవుతోంది.అయితే దీని ద్వారా బీజేపీకి కలిగే లాభం ఏంటో మరి .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube