30 ఏళ్లుగా ఆయన ఐస్ ముక్కలు మాత్రమే తింటున్నాడు..! షాకింగ్!

ఇప్పటివరకూ చీమల్ని తినేవారిని.బల్లుల్ని తినేవారిని చూసాం.

 Man Eating Ice Cubes From 30 Years-TeluguStop.com

ఆఖరికి ఇనుప ముక్కల్ని కూడా మింగేసే వారిని చూసాం కానీ ఐసుగడ్డలు మాత్రమే తినేవారిని చూసారా.ఏదో ఎండాకాలం వేడికి తట్టుకోలేక చల్లని పదార్దాలు తినేవారుంటారు కానీ.

వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం.తేడా లేదు.

అన్ని కాలాల్లోనూ ఐసు గడ్డలు మాత్రమే తినే వ్యక్తిని చూసారా.చదువుతుంటేనే పల్లు జివ్వు మంటున్నాయా.

నిజమండీ కేవలం ఐస్ మాత్రమే తింటూ బతికే వ్యక్తి ఉన్నారు.అతనే కాంతిభాయ్ మిస్త్రీ…

గుజరాత్‌లోని అమ్రెలీకి చెందిన కాంతిభాయ్ మిస్త్రీకి మంచుముక్కలు తినడంతోనే రోజు ప్రారంభమవుతుంది.ఇలా ప్రతీ రెండు గంటలకూ ఐసు గడ్డలు తింటుండటంతో ఇతనిపేరు ఊరూవాడా మారుమోగిపోతోంది.గత ముప్పై ఏళ్లుగా మిస్త్రీ ఐసుముక్కలే ఆహారంగాతీసుకుంటున్నారు.

దీంతో అందరూ అతన్ని ఐస్ మ్యాన్ అని పిలుస్తున్నారు.కాంతిభాయ్ రోజుకు కనీసం 10 నుంచి 15 ఐసు గడ్డలను అలవోకగా లాగించేస్తాడు.

చదువుతుంటేనే పల్లు జివ్వుమంటున్నయా.ఈ మహానుభావుని ఇంట్లో రెండు ఫ్రిడ్జ్‌లు ఉండగా, దానిలో ఉబికివచ్చే ఐస్‌ను కడుపారా ఆరగించేస్తుంటాడు.

చెప్తుంటేనే వణుకొస్తుందా…మనకే ఇలా ఉంటే అతను మాత్రం పైగా దీని గురించి అతనికి మాత్రం ఏ ఆందోళన ఉండదు.అంతేకాదు ఇప్పటివరకూ అతను ఒకసారి కూడా ఎప్పుడూ వైద్యుణ్ణి సంప్రదించ లేదట.

మనం ఎవరింటికైనా వెళితే మంచినీళ్లడుగుతాం.లేదంటే వారే మజ్జిగ ఇస్తారు కానీ ఈక్ష్న ఎవరింటికెళ్లినా ఐసు గడ్డలతోనే ఆతిద్యం స్వీకరిస్తాడట.కార్పెంటర్ పనిచేసే ఈ ‘ఐస్ మ్యాన్’ తాను ఏ ఇంటికి వెళ్లినా అక్కడ ఇంటి యజమానిని ఐసుగడ్డలు అడిగిమరీ ఆరగిస్తుంటాడట.అంతేకాదు భవిష్యత్ లో కాంతీభాయ్ మిస్త్రీ కాశ్మీర్‌లో స్థిరపడాలని అనుకుంటున్నాడు.

అక్కడ మంచుకు కొరత ఉండదు కదా అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడట.ఈ వింత అలవాటుపై వైద్యులు మాట్లాడుతూ ప్రపంచంలో ఇలాంటివారు అతి అరుదుగా ఉంటారన్నారు.

రక్తంలో లోటుపాట్ల కారణంగా ఇలా జరుగుతుందని, కాంతిభాయ్ తక్షణమే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని, లేని పక్షంలో అతని ప్రాణాలకే ముప్పు అని వారు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube