ఇప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎన్నికల బరిలోకి ఒంటరిగా వెళ్లాలంటేనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బయపడుతున్నాడు.పైకి గంభీరంగా ఎన్ని కబుర్లు చెప్తున్నా లోపల మాత్రం ఆయన పడే టెన్షన్ అంత ఇంతా కాదు.
ఎందుకంటే ఒకవైపు పార్టీ నిర్మాణం పూర్తిస్థాయిలో లేదు.అలాగే గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణమే జరగలేదు.
ఈ దశలో బలమైన ప్రత్యర్ధులుగా ఉన్న టీడీపీ – వైసీపీలను ఎదుర్కోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.ఆ విష్యం పవన్ కి కూడా బాగా తెలుసు.
అందుకే ఎన్నికల బరిలోకి ఒంటరిగా వెళ్లేకంటే పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లలో పోటీ చేస్తే మంచిది అనే ఆలోచనలో పవన్ ఉన్నాడు.
జనసేన ఆవిర్భవించి ఇప్పటికే నాలుగేళ్లు గడిచాయి.ఇప్పటికిప్పుడు జనసేన బలపడిపోయే అవకాశాలు కూడా లేవు.ఈ నేపథ్యంలో ఎన్నో కొన్ని సీట్లను తీసుకుని వైసీపీతో పొత్తుతో వెళ్లాలని జనసేన భావిస్తున్నట్టుగా అత్యంత ఇశ్వసనీయ సమాచారం.
ఇదే సమయంలో జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ కూడా ఆశగా చూస్తోంది.అయితే టీడీపీ మీద ఇప్పటికే అనేక ఆరోపణలు చేసి ఉన్నాడు పవన్ అదీ కాకుండా ఆ పార్టీకి ఇప్పుడు ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది ఈ దశలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే కంటే వైసీపీతో జత కడితే బాగుంటుందనే ఆలోచనకి పవన్ వచ్చేసాడు.
అందుకే వైఎస్సార్సీపీతో పొత్తు ప్రయత్నాల్లో ఉందట జనసేన.ముప్పై సీట్లకు బేరం ఆడుతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే వైసీపీ నుంచి మాత్రం ఆ ప్రతిపాదన పై సమాధానం రావడంలేదట.ముప్పై సీట్లను జనసేనకు కేటాయించే ఛాన్సే లేదని తెలుస్తోంది.
అందులో సగం సీట్ల స్థాయిలో అయితే జగన్ ఒప్పుకునేందుకు రెడీ గా ఉన్నట్టు తెలుస్తోంది.
జగన్ కూడా రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్తున్నాడు.
తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదలచలేదని జగన్ స్పష్టం చేశాడు.పవన్ కల్యాణ్ మీకు మద్దతు పలుకుతాడంటే కదా? అనే అంశంపై జగన్ స్పందిస్తూ.ఎవరి మద్దతు తాము కోరుకోవడంలేదని చెప్తున్నాడు.కానీ సీట్ల బేరం కనుక ఒక కొలిక్కి వస్తే ఇరు పార్టీల మధ్య పొత్తు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.
.