సూపర్‌ స్టార్‌.. ఏంటీ చిల్లర పని?

మలయాళ హీరోయిన్‌ కిడ్నాప్‌ మరియు లైంగిక వేదింపుల విషయం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.ఒక హీరోయిన్‌కే భద్రత లేదంటూ మహిళ సంఘాల వారు మరియు ప్రజా సంఘాల వారు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది.

 Amma Open To Having Dileep Back After Mohanlal Takes Charge-TeluguStop.com

కేంద్రం నుండి కేరళ రాష్ట్ర ప్రభుత్వం వరకు ఈ విషయమై సీరియస్‌గా తీసుకున్నారు.కిడ్నాప్‌కు కారణం అయిన వారిని, వారి వెనుక ఉన్న వారిని కొద్ది కాలం తేడాతోనే పట్టేసుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు దిలీప్‌.

మలయాళ నటుడు అయిన దిలీప్‌ చెప్తే ఆమెను కిడ్నాప్‌ చేసి, లైంగికంగా వేదించాం అంటూ పోలీసుల ఎంక్వౌరీలో కిడ్నాప్‌కు పాల్పడ్డ వారు చెప్పుకొచ్చాడు.దాంతో దిలీప్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు దాదాపు మూడు నెలల పాటు జైల్లోనే ఉంచారు.ఎంక్వౌరీలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

ఆయన చేసిన తప్పుకు త్వరలోనే శిక్ష పడటం ఖాయం అంటూ సినీ వర్గాల వారు భావిస్తున్నారు.ప్రస్తుతం బెయిల్‌పై ఉండి, కేసు పేచీలకు హాజరు అవుతున్న దిలీప్‌ను అప్పట్లో అసోషియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్‌ (అమ్మ) వారు బహిష్కరించడం జరిగింది.

దిలీప్‌ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు.ఆయన గత కొన్ని రోజులుగా అమ్మలో తనకు తిరిగి సభ్యత్వం ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేస్తున్నారు.కాని మొన్నటి వరకు ఉన్న అధ్యక్షుడు ఆయన విజ్ఞప్తిని పట్టించుకోలేదు.కాని తాజాగా అమ్మ అధ్యక్షుడు అయిన సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు.

కంకితుడిగా పేరు తెచ్చుకుని, కన్నడ సినిమా పరిశ్రమ పేరుకు కలంకం తెచ్చి, మలయాళ సినిమా పరిశ్రమకు మాయని మచ్చ తీసుకు వచ్చిన దిలీప్‌కు తిరిగి సభ్యత్వం ఇచ్చాడు.

మలయాళ సినీ జనాలు మరియు ప్రేక్షకులు ఆరాధ్యదైవంగా భావించే మోహన్‌ లాల్‌ ఇలాంటి నిర్ణయంను తీసుకోవడం ఏ ఒక్కరు సహించడం లేదు.

సినిమా పరిశ్రమకు చెందిన వారు కూడా పలువురు ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే బాధిత హీరోయిన్‌ అమ్మకు రాజీనామా చేసింది.ఇంకా పలువురు కూడా అమ్మ సభ్యత్వంను వదులుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.ఇప్పటికైనా సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ తన నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాల్సిందిగా పలువురు నటీనటులు డిమాండ్‌ చేస్తున్నారు.దిలీప్‌ వంటి వ్యక్తులు సినిమాలో కనిపించడం వల్ల మరింతగా నేరప్రవృత్తి పెరిగే అవకాశం ఉందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube