బిగ్‌బాస్‌ ఇంటికి యంగ్‌ టైగర్‌?

తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ‘బిగ్‌బాస్‌’కు తాజాగా సీజన్‌ 2 ప్రారంభం అయ్యింది.అంతా అనుకున్నట్లుగా బిగ్‌బాస్‌ సీజన్‌ 2 అంతగా ఆకట్టుకోలేక పోతుందనే విషయం వాస్తవం.

 Ntr Big Going To Boss Boss Season 2 House-TeluguStop.com

ఇంట్లో సెలబ్రెటీలు మరియు బయట నాని కూడా ఆకట్టుకోలేక పోతున్నారు అని, అందుకే షోకు మసాలా యాడ్‌ చేసేందుకు నిర్వాహకులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా బిగ్‌బాస్‌ ఇంటికి ఎన్టీఆర్‌ను పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

ఎన్టీఆర్‌ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించాడు.ఆయన్ను ఇంట్లోకి ఒక రోజు పంపించడం వల్ల షోకు ఒక్కసారిగా క్రేజ్‌ తీసుకు రావచ్చనే ఉద్దేశ్యంతో షో నిర్వాహకులు ఉన్నారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో మొదటి రోజే ఎన్టీఆర్‌ను చూపించాలని భావించారు.అయితే నాని ప్రత్యేకత వెలుగులోకి రాదని, మొదటి రోజే ఎన్టీఆర్‌ వస్తే ఫోకస్‌ చేంజ్‌ అవుతుందని భావించారు.అందుకే మొదటి రోజు కాకుండా ఇప్పుడు ఎన్టీఆర్‌ను తీసుకు వచ్చే ఉద్దేశ్యంతో షో నిర్వాహకులు ఉన్నారు.ప్రస్తుతం బిగ్‌బాస్‌ షో నిదానంగా, నిద్రపోతున్నట్లుగా సాగుతుంది.అందుకే ఎన్టీఆర్‌ను షోలో ఒక్కసారి ఎంటర్‌ చేస్తే ఒక్కసారిగా దూసుకు పోయే అవకాశం ఉందని వారు అనుకుంటున్నారు.ఇప్పటికే ఎన్టీఆర్‌ కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మొదటి సీజన్‌ సమయంలోనే రెండవ సీజన్‌ చేయలేని పక్షంలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇవ్వాలంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు.అందుకే ఈ షో కోసం ఒకటి లేదా రెండు సార్లు ఎన్టీఆర్‌ వచ్చే అవకాశం ఉంది.

ఎన్టీఆర్‌ రాకతో బిగ్‌బాస్‌ ఒక్కసారిగా టీఆర్పీలో పీక్స్‌కు చేరే అవకాశం ఉంది.వచ్చే వారంలో ఎన్టీఆర్‌ను రంగంలోకి దించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.ఎన్టీఆర్‌ ప్రస్తుతం సినిమాతో బిజీగా ఉన్నప్పటికి కూడా బిగ్‌బాస్‌పై అభిమానంతో ఈ షోకు రాబోతున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్నాడు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.అరవింద సమేత చిత్రం తర్వాత భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న రాజమౌళి మల్టీస్టారర్‌ చిత్రంలో రామ్‌ చరణ్‌తో కలిసి నటించబోతున్నారు.

ఆ తర్వాత అన్న నిర్మాణంలో ఒక చిత్రాన్ని చేసేందుకు కమిట్‌ అయ్యాడు.సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న కారణంగానే బిగ్‌బాస్‌ సీజన్‌ 2కు నో చెప్పాడు.

ఇప్పుడు చిన్న గెస్ట్‌గా ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube