మెగా డాటర్ నీహారికా కొణిదెలను ఆమె వెడ్డింగ్ గురించి అడగ్గా మండిపడింది.‘మేడం మేము యూ ట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం.
ఈ మధ్య సోషల్ మీడియాలో మీ వెడ్డింగ్ గురించి బాగా వైరల్ అవుతోంది మేడమ్.దాని గురించి ఏమైనా చెప్తారా?’ అని అడగ్గా నీహారిక ‘అసలు ఎవరయ్యా వీళ్లను లోపలికి రానిచ్చింది? నా పెళ్లి గురించి మీకెందుకయ్యా? నీహారిక ఎవరిని చేసుకుంటుంది? ఎప్పుడు చేసుకుంటుంది? ఎందుకు చేసుకుంటుంది? చూస్తే షాక్ అవుతారు.షేక్ అవుతారు.కిందపడి లేస్తారు.పిచ్చామీకేమైనా? మీ థంబ్‌నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా?’’ అంటూ మండిపడింది.

ఆ తర్వాత ఆ ఛానల్ ‘మేడమ్ మేము అడిగేది మీ హ్యాపీ వెడ్డింగ్ మూవీ గురించి’ అనగానే.నీహారిక ‘‘సారీ సారీ సారీ.మళ్లీ మళ్లీ ఓకేనా? హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్ ఈ జూన్ 30న రిలీజ్ అవుతుంది.అప్పుడు మేము సినిమా రిలీజ్ ఎప్పుడో చెబుతాం ఓకే’’ అంటూ బై చెప్పేసి కారెక్కి వెళ్లిపోయింది.ఇదండీ కథ.ఇదంతా నిజం కాదు హ్యాపీ వెడ్డింగ్ మూవీ కోసం డిఫరెంట్‌గా క్రియేట్ చేసిన ప్రమోషనల్ వీడియో.యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నీహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించారు.