ఆరెస్సెస్ లో కొత్త వెలుగులు..అంతా ప్రణబ్ముఖర్జీ దయేనా..?

ఆరెస్సెస్.(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ఈ పేరు చెప్తేనే భాజపా నేతల వెన్నుల్లో వణుకు పుడుతుంది.ప్రధాని మోడీ అయినా సరే ఆరెస్సెస్ కనుసన్నల్లో ఉండాల్సిందే.వారికి రాజకీయాలకంటే వారు నమ్మిన సిద్ధాంతాలాకి ఎక్కువగా విలువ ఇస్తారు…హిందుత్వ సిద్ధాంతాలతో సాగే బీజేపీకి మాతృక.ఈ వేదిక ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.ఇందుకు కారణం మోడీ నో , అమిత్ షా నో అనుకునేరు వారెవ్వరూ కాదు బీజేపీ నేతలు అసలే కాదు.

 After Pranab Mukherjees Nagpur Visit Rss Claims Dividends In Bengal-TeluguStop.com

ఈ నూతన తేజానికి కారణం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు.ఏంటి ఈ సస్పెన్స్ అనుకుంటున్నారా వివరాలలోకి వెళ్తే.

నాగ్ పూర్ లోని ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇటీవల సందర్శించిన విషయం అందరికీ తెలిసిందే అయితే…ఆరెస్సెస్ శిక్షా వర్గ్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరై ప్రసంగించారు కూడా.ఈ ప్రసంగం తర్వాత తమ సంస్థకు ప్రజాదరణ పెరిగిందని ఆరెస్సెస్ సీనియర్ నేత బిప్లబ్ రాయ్ చెప్పారు.అంతేకాదు ఇప్పుడు ఎంతో మంది సంఘ్ లోకి చేరేందుకు ఆసక్తిని చూపడానికి కూడా కారణం ఇదేనట.

తలపండిన కాంగ్రెస్ లో నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యుల తర్వాత.

అంతగా ప్రభావం చూపే చరిష్మా ఉన్న నేత ఎవరన్నా ఉన్నారు అంటే అది రాజకీయ ప్రత్యర్థులు సైతం అజాతశత్రువుగా సంబోధించే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ…మొదటినుంచీ కాంగ్రెస్ వాది అయిన ప్రణబ్ ముఖర్జీ.మతసహనం అనే కీలక అంశంపై హితబోధ చేసేలా ప్రణబ్ మాట్లాడారు.

అయితే ప్రణబ్ తో రాక అనంతరం సంఘ్ పట్ల…సంఘ్ లో చేరిక పట్ల ఎంతో మంది ఆసక్తిని చూపుతున్నారని తెలుస్తోంది.

ఇదిలాఉంటే ఈ నెల ఆరో తేదీ వరకు జాతీయ స్థాయిలో రోజూ సగటున 378 మంది ఆరెస్సెస్ లో చేరతామని జాయిన్ ఆరెస్సెస్ వెబ్ సైట్ లో విజ్ఞప్తులు వస్తున్నాయని ప్రణబ్ సందర్శించిన తర్వాత రోజూ సగటున 1200 నుంచీ 1300 వరకూ విజ్ఞప్తులు వస్తున్నాయని సంఘ్ నేత తెలిపారు.

వాటిల్లో 40 శాతం బెంగాల్ నుంచేనని ఆయన పేర్కొనడం గమనార్హం.అయితే కాంగీ లో ఎంతో మంది సీనియర్స్ లా కాకుండా ప్రణబ్ముఖర్జీ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దిశగా అడుగులు వేస్తూ వెళ్ళారు

2019.

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ – బీజేపీయేతర పక్షాలను ఏకతాటిపైకి తేవడంలో ప్రణబ్ ముఖర్జీ కీలకపాత్ర…పోషించనున్నట్టు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి.మరోవైపు ఆరెస్సెస్ ని బెంగాల్ లో విస్తరించాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ,ఆరెస్సెస్ ఈ అవకాశాన్ని తమకి అనువుగా మలుచుకుని బెంగాల్ లో పుంజుకోవాలని వ్యుహారచన చేస్తున్నాయి ఏది ఏమైనా సరే ప్రణబ్ముఖర్జీ రాకతో ఆరెస్సెస్ లో కొత్త శోభ సంతరించుకుంది అంటున్నారు రాజకీయ పండితులు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube