విజయ్‌కి వరుస ఛాన్స్‌ల వెనుక కేటీఆర్‌?

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇవ్వడం దాదాపు అసాధ్యం.ఏదైనా అద్బుతం జరిగితే తప్ప బ్యాక్‌ గ్రౌండ్‌ లేనివారు తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా ప్రస్తుతం గుర్తింపు తెచ్చుకోవడం కష్టం.

 Ktr Went To Vijay Devarakonda Home-TeluguStop.com

అలాంటిది ఒక సామాన్యమైన వ్యక్తిగా పేర్కొనే విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా మారిపోయాడు.మొన్నటి వరకు ఈయన కష్టపడి, మెల్ల మెల్లగా సినిమాలు చేసుకుంటూ పైకి వచ్చాడని అంతా అనుకుంటున్నారు.

అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం విజయ్‌ దేవరకొండకు వరుసగా వస్తున్న ఆఫర్ల వెనుక మంత్రి కేటీఆర్‌ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో చిన్నదైన ముఖ్యమైన పాత్ర పోషించిన విజయ్‌ ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ చిత్రంతో స్టార్‌ అయ్యాడు.సామాన్యుడికి సక్సెస్‌ దక్కినా ఆ తర్వాత మంచి ఆఫర్లు రాకున్నా, సక్సెస్‌లు దక్కకున్నా కూడా కనుమరుగవుతారు.అయితే ‘పెళ్లి చూపులు’ చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండకు అనుకోని అవకాశం అన్నట్లుగా ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంను చేసే అవకాశం దక్కింది.

ఆ చిత్రంతో ఏకంగా టాలీవుడ్‌లోనే మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అయ్యాడు.ఎప్పుడెప్పుడు ఈయన సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.ఇక ఈయనతో సినిమాలు నిర్మించేందుకు పలువురు నిర్మాతలు క్యూలు కడుతున్నారు.

విజయ్‌ దేవరకొండతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూలు కడుతున్నందుకు మరో కారణం కూడా ఉందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

విజయ్‌కు కేసీఆర్‌ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్నాయి.ఈ రెండు కుటుంబాల మద్య బందుత్వం కూడా ఉండి ఉంటుందనే ప్రచారం జరుగుతుంది.ఇలాంటి సమయంలో విజయ్‌తో మంత్రి కేటీఆర్‌ చాలా సన్నిహిత్యంగా ఉండటంతో పాటు, తాజాగా విజయ్‌ దేవరకొండ ఇంటికి కేటీఆర్‌ రావడం జరిగింది.కేటీఆర్‌తో చాలా మంచి సాన్నిహిత్యం ఉన్న కారణంగా తమకు ఉపయోగం అవుతందనే ఉద్దేశ్యంతో నిర్మాతలు విజయ్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మంత్రి అన్నప్పుడు ఎంత డబ్బున్న వారికి అయినా ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడాల్సిందే.అది సీఎం తర్వాత స్థాయి వ్యక్తి అన్నప్పుడు ఆ వ్యక్తికి ఎంత దగ్గరగా ఉంటే అంత లాభం చేకూరుతుందనే విషయం అంతా ఒప్పుకుంటారు.

అందుకే విజయ్‌ దేవరకొండ ద్వారా తమకు కావాల్సిన ఏమైనా పనులు చేయించుకునేందుకు నిర్మాతలు విజయ్‌తో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు అంటూ సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube