నందమూరి ఫ్యామిలీ మద్య విభేదాలు ఉన్నట్లుగా గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.అది నిజమే అని పలు సందర్బాల్లో వెళ్లడి అయ్యింది.
ముఖ్యంగా ఎన్టీఆర్, బాలకృష్ణల మద్య మచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటుంది.బాలకృష్ణ కావాలని ఎన్టీఆర్‌ను దూరంగా ఉంచుతున్నాడు అంటూ నందమూరి అభిమానులు మరియు రాజకీయ నాయకులు చెబుతున్నారు.
వీరిద్దరి మద్య ఉన్న విభేదాలు ప్రస్తుతం తారా స్థాయికి చేరాయి.ఎన్టీఆర్‌ను కనీసం చూసేందుకు కూడా బాలయ్య ఇష్ట పడటం లేదు అనే టాక్ సినీ వర్గాల్లో ఉంది.
మరో వైపు ఎన్టీఆర్‌కు అన్న కళ్యాణ్ రామ్ మరియు తండ్రి హరికృష్ణలు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇలాంటి సమయంలో బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఒక చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.ఆ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించబోతున్నాడు.ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటించాలని ఆశ పడుతున్నాడు.
కాని ఆ ఆశ నెరవేరేలా లేదు.మొదట ‘ఎన్టీఆర్’ చిత్రాన్ని తేజ దర్శకత్వంలో చేయాలని బాలకృష్ణ భావించాడు.
తేజ దాదాపు మూడు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ కూడా చేశాడు.కాని ఏమైందో ఆయన సినిమా నుండి వెళ్లి పోయాడు.
తేజ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న సమయంలో రెండు సార్లు కళ్యాణ్ రామ్‌తో ఒక పాత్రను చేయాల్సిందిగా కోరడం జరిగింది.
ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత హరికృష్ణ ఆయన రధ సారధిగా వ్యవహరించారు.
అందుకే ఆయన పాత్రను కళ్యాణ్ రామ్‌తో చేయించాలని తేజ భావించాడు.తాత సినిమాలో తండ్రి పాత్ర అంటే వద్దనుకుంటాడా, వెంటనే సరే అనేశాడు.
కాని సినిమా చేతులు మారిన తర్వాత పరిస్థితి కూడా తారుమారు అయినట్లుగా అనిపిస్తుంది.క్రిష్ ఈ చిత్రంలో హరికృష్ణ పాత్రను కళ్యాణ్ రామ్‌తో చేయించాలని భావించడం లేదు.
ఆయన ఆలోచన ప్రకారం కొత్త వారితోనే హరికృష్ణ పాత్ర చేయించడం వల్ల బాలకృష్ణ పాత్రకు వెయిట్ ఎక్కువ దక్కుతుందనే ఆశ ఆయనలో కలుగుతుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఎన్టీఆర్ సినిమా కోసం ప్రయోగాలు చేయవద్దని ఆయన భావిస్తున్నాడు.
తాజాగా కళ్యాణ్ రామ్ ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ.తాత చిత్రం కోసం గతంలో తేజ నన్ను రెండు మూడు సార్లు సంప్రదించాడు.కాని క్రిష్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి సంప్రదింపులు రాలేదు.అందుకే క్రిష్ చేస్తున్న ఈ చిత్రంలో తాను అక్కర్లేదేమో అనుకుంటున్నాను అన్నాడు.
ఒకవేళ క్రిష్ నుండి లేదా బాబాయి నుండి కాల్ వస్తే తప్పకుండా నటిస్తాను అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ‘ఎన్టీఆర్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి.