బిగ్‌బాస్‌ 2కు డేట్‌ ఫిక్స్‌

పలు ప్రపంచ దేశాల్లో బిగ్‌బాస్‌కు విపరీతమైన ఆధరణ ఉంది.భారతదేశంలో కూడా హిందీ వర్షన్‌ దాదాపు పది సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ప్రేక్షకులు అభిమానంను పొందుతూ వస్తుంది.

 Big Boss 2 Telugu Dates Fixed-TeluguStop.com

హిందీలో సూపర్‌ హిట్‌ అయిన బిగ్‌బాస్‌ను గత సంవత్సరం సౌత్‌ ఇండియాలో ప్రారంభించారు.తెలుగు మరియు తమిళంలో కొద్దిపాటి తేడాతో బిగ్‌బాస్‌ను షురూ చేయడం జరిగింది.

తెలుగులో ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, తమిళంలో కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించాడు.రెండు భాషల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం రెండు భాషల్లో కూడా సీజన్‌ 2కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

గత సంవత్సరం తమిళ బిగ్‌బాస్‌ ముందుగానే ప్రారంభం అయ్యింది.ఈసారి మాత్రం రెండు భాషల్లో దాదాపు ఒకేసారి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.స్టార్‌ మాటీవీ వారు ఇప్పటికే నానిని హోస్ట్‌గా ఎంపిక చేయడంతో పాటు పార్టిసిపెంట్స్‌ ఎంపిక కార్యక్రమం పూర్తి చేశారు.

వారితో ప్రస్తుతం అగ్రిమెంట్‌ను చేసుకుంటున్నారు.రేపటితో ఐపీఎల్‌ పూర్తి కాబోతుంది.

ఆ తర్వాత వారం రోజుల గ్యాప్‌లో బిగ్‌బాస్‌ను ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను జూన్‌లో ప్రారంభించనున్నట్లుగా స్టార్‌ మా వారు ప్రకటించారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూన్‌ రెండవ వారంలో అంటే 9వ తారీకున ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.నాని హోస్ట్‌గా చేయబోతున్న బిగ్‌బాస్‌ సీజన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా ఈ షో ఉంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు.భారీ ఎత్తున ఈ షోను నిర్వహిస్తున్నారు.

మొదటి సీజన్‌తో పోల్చితే రెండవ సీజన్‌లో చాలా మార్పులు చేర్పులు చేశారు.గత సీజన్‌లో కేవలం 60 రోజులు మాత్రమే నిర్వహించారు.

ఈసీజన్‌లో మాత్రం ఏకంగా 100 రోజులు షో ప్రసారం కాబోతుంది.

ఎన్టీఆర్‌ బిజీగా ఉన్న కారణంగా నానిని ఎంపిక చేయడం జరిగింది.

నానితో ఇప్పటికే ఆడిషన్స్‌ చేసి పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశారు.అన్నపూర్ణ స్టూడియోస్‌లో బిగ్‌బాస్‌ ఇల్లు నిర్మాణం కూడా చివరి దశకు చేరింది.

గత సీజన్‌ను ముంబయి సమీపంలో నిర్వహించారు.కాని ఈసీజన్‌ను మాత్రం హైదరాబాద్‌లోనే నిర్వహించాని స్టార్‌ మా వారు నిర్ణయించారు.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube