అభిమానంకు హద్దు పద్దు తప్పనిసరిగా ఉండాలి.అలా లేకుంటే ఇబ్బందులు తప్పవు.
హీరోల అభిమానులు కొన్ని సార్లు వ్యవహరించే తీరు, వారు మాట్లాడే మాటలు, ఇతర హీరోలను ట్రోల్ చేసే విధానం దారుణంగా అనిపిస్తుంది.ఎందుకు ఇంతగా వీరు రియాక్ట్ అవుతున్నారు అని స్వయంగా ఆ హీరోలే ఆవేదన వ్యక్తం చేస్తారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరోపై ఎవరైనా కామెంట్స్ చేస్తే వారిని ఉతికి ఆరేసే వరకు ఊరుకోరు.తన అభిమానుల వల్ల పవన్ పలు సందర్బాల్లో మాట పడాల్సి వచ్చింది.
ఇప్పుడు అదే అనుభవం అల్లు అర్జున్‌కు ఎదురైంది.

మెగా హీరోల్లో ఒక్కడైన అల్లు అర్జున్‌కు ఇతర స్టార్ హీరోతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువే అని చెప్పుకోక తప్పదు.అయితే ఈయనకు కేరళలో అభిమానులు లెక్కకు మించి ఉన్నారు.కేరళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్ మరియు మమ్ముటిల స్థాయిలో బన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అందుకే బన్నీ ఏ సినిమా చేసినా కూడా కేరళలో భారీగా విడుదల అవ్వడం జరుగుతుంది.సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మంచి వసూళ్లు రాబడుతుంది.ఇప్పటి వరకు ఏ ఇతర భాష హీరో కూడా కేరళలో ఇంతగా అభిమానగణంను ఏర్పాటు చేసుకోలేక పోయాడు.కేరళలో అల్లు అర్జున్ అభిమాన సంఘాలు భారీగానే ఉన్నాయి.
అల్లు అర్జున్‌పై ఈగ వాలినా ఆ అభిమాన సంఘం వారు ఊరుకోరు.తమ అభిమాన నటుడి సినిమాపై ఎవరు ట్రోల్ చేసినా కూడా వారు భరించలేరు.
వారిపై చాలా సీరియస్‌గా రియాక్ట్ అవుతారు.తాజాగా తెలుగులో తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం మలయాళంలో విడుదలైంది.
ఇక్కడ ఎలాంటి ఫలితంను చవి చూసిందో అక్కడ కూడా అదే తరహా ఫలితంను చవి చూసింది.దాంతో అక్కడ సినీ విమర్శకులు మరియు సాదారణ ప్రేక్షకులు సైతం ఆ సినిమాపై విమర్శలు గుప్పిస్తూ, నెగటివ్ కామెంట్స్ చేస్తూన్నారు.
అందరి మాదిరిగానే ఒక వెబ్ మీడియా విశ్లేషకురాలు అయిన ప్రశాంతి కూడా సినిమాను ట్రోల్ చేసింది.
మలయాళంలో సినిమా చూస్తూ ప్రశాంతి సోషల్ మీడియాలో.
సినిమా చూస్తుంటే తల నొప్పి లేస్తోంది.బయటకు వెళ్లి పోదామా అంటే వర్షం వస్తోంది అంటూ పోస్ట్ చేసింది.
దాంతో అల్లు అర్జున్ మలయాళ ఫ్యాన్స్ ఆమె పోస్ట్‌పై విరుచుకు పడ్డారు.ఆమె పోస్ట్‌కు వేలాది కామెంట్స్ వచ్చాయి.
ఎక్కువ శాతం ఆమెను చంపేస్తామని, ఆమెకు సినిమా చూసే అనుభవం లేదంటూ విమర్శలు చేశారు.అయితే కొందరు మాత్రం ఏకంగా తమ అభిమాన హీరోను విమర్శించినందుకు రేప్ చేస్తామంటూ హెచ్చరించారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఈమె ఎక్కడ కనిపించినా వదిలి పెట్టవద్దని, రేప్ చేయాలని కొందరు పిలుపునిచ్చారు.దాంతో ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు ఎంక్వౌరీ చేసి ఆమెపై కామెంట్స్ చేసిన వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.ఈ విషయమై ఇప్పటి వరకు అల్లు అర్జున్ రియాక్ట్ అవ్వలేదు.







