లోకేష్ బాబు ఎంట్రీ కోసం చంద్రబాబు చంద్రగిరి నియోజక వర్గం ఇంచార్జ్ అయిన మాజీ మంత్రి ,సీనియర్ లీడర్ మరియు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కి తల్లి అయిన గల్లా అరుణకి చెక్ పెట్టారు.పుత్రుడి కోసం మా నేతనే తప్పుకోమని చెప్తారా అంటూ గల్లా అరుణ మద్దతు దారులు ఎంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ క్రమంలోనే ఆమె రాజకీయాల నుంచీ తప్పుకుంటున్నారు అంటూ ప్రకటన చేశారు…అయితే ఈ ప్రకటన వెనుక ఉన్న నిజా నిజాలు ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నాయి.చంద్రగిరిలో అసలేం జరిగింది.? అరుణ అసలు ఎందుకు తప్పుకున్నారు అనే వివరాలోకి వెళ్తే.

లోకేష్ బాబు మంత్రి అవ్వడంకోసం ముందుగా ఎమ్మెల్సీ ని చేసి ఆపై మంత్రి వర్గంలోకి తీసుకుని వచ్చారు అంటే ప్రజల చే ఎన్నుకోబడ్డ నాయకుడు కాదు అయితే ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకుతున్న లోకేష్ బాబు కి ఓటమి లేకుండా తెలుగుదేశం కంచుకోటలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతూ వెళ్తున్నారు అంటే దీని అర్థం ఏమిటంటే గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ నియోజక వర్గాన్ని బలమైన తెలుగుదేశం కోటలుగా చేసుకుంటూ వస్తున్న ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరు లోకేష్ కోసం త్యాగం చేయాలి.ఇదీ అసలు కాన్సెప్ట్.
లోకేష్ కి పరాభవం రాకుండా ఉండాలి అంటే చంద్రగిరి మాత్రమే సేఫ్ ప్లేస్ అని గురించిన చంద్రబాబు ఆదిసగా పావులు కదిపారు.
అసలు ముందుగా లోకేష్ మామ బాలయ్య నియోజకవర్గం పై కన్ను పడినా అక్కడ ఇప్పటికే బాలయ్య పెర్ఫార్మెన్స్ కి జనాలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక వెనకడుగు వేశారు.అయితే గుడివాడ నుంచీ పోటీ చేద్దామా అంటే అక్కడ నానీ తో పోటీ పడగలిగే సత్తా లోకేష్ కి లేదని తెలిపోయిందట దాంతో పెనమలూరు అనుకున్నారు కానీ చంద్రబాబు సర్వే పకారం చంద్రగిరి మాత్రమే లోకేష్ కి సేఫ్ అని ఫిక్స్ అయ్యారట.
దాంతో.గల్లా అరుణకి అసలు విషయం చెప్పి.
మీరు గెలిచే అవకాశం ఇక్కడ ఏ మాత్రం లేదు కాబట్టి లోకేష్ పోటీ చేస్తాడని చెప్పారట దాంతో తీవ్ర అసంతృప్తికి లోనయిన ఆమె శాశ్వతంగా రాజకీయాల నుంచీ తప్పుకున్తున్నట్టుగా ప్రకటించింది అయితే ఆమె ప్రస్థుతానికీ సైలెంట్ గా ఉన్నా త్వరలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు అరుణ వర్గీయులు.