సాధారణంగా ప్రతి ఒక్కరు బయటకు వెళ్లే సమయంలో డియోడ్రెంట్ వాడటం సహజమే.బయటకు వెళ్లే కంగారులో డియోడ్రెంట్ బట్టలపై పడే మరకల గురించి పెద్దగా పట్టించుకోము.
దాంతో ఆ మరకలు చాలా మొండిగా తయారవుతాయి.వాటిని వదిలించుకోవటం కాస్త కష్టమైన పని.అయినా కొన్ని ఇంటి చిట్కాల ద్వారా బట్టలపై పడిన డియోడ్రెంట్ మరకలను సులభంగా తొలగించుకోవచ్చు.ఇప్పుడు ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.
ఆల్కహాల్ఆల్కహాల్ అనేక రకాల మరకలను తొలగించటానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది.మరక ఉన్న ప్రదేశంలో కొంచెం ఆల్కహాల్ ని వేసి రుద్దితే మరక తొలగిపోతుంది.మొండి మరక అయితే కొంచెం సేపు ఆల్కహాల్ లో నాన బెట్టి ఉతకాలి.

వెనిగర్
ఇది మరకలను తొలగించటంలో మేజిక్ చేస్తుంది.గోరువెచ్చని నీరు,వెనిగర్ సమన పరిమాణంలో తీసుకోని బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని మరక ఉన్న ప్రదేశంలో వేసి రుద్దితే తొలగిపోతుంది.
మొండి మరక అయితే కొంచెం సేపు వెనిగర్ మిశ్రమంలో నానబెట్టి ఉతకాలి.
బేకింగ్ సోడా
బేకింగ్ సోడాలో నీటిని కలిపి పేస్ట్ గా తయారుచేయాలి.
ఈ పేస్ట్ ని మరక ఉన్న ప్రదేశంలో రాసి కొంచెం సేపు ఆలా వదిలేసి ఆ తర్వాత ఉతికితే మరకలు సులభంగా తొలగిపోతాయి.
ఆస్ప్రిన్ మాత్ర
కొంచెం నీటిలో రెండు ఆస్ప్రిన్ మాత్రలను వేయాలి.
ఆ నీటిని మరకలు ఉన్న ప్రదేశంలో పోసి అరగంట అయ్యాక ఉతికితే మరకలు తొలగిపోతాయి.అయితే ఈ చిట్కా కేవలం తెల్లని బట్టలకు మాత్రమే.







