వారణాసిలో మోడీ ఓటమి తధ్యం..షాకింగ్ రిజల్ట్స్ ..

రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు.మిత్రులు శత్రువులు అవుతారు.

 Narendra Modi May Lose Varanasi In 2019 Elections.?-TeluguStop.com

శత్రువులు మిత్రులు అవుతారు.అయితే ఈ సూత్రమే ఇప్పుడు మోడీ కి పెద్ద తలనెప్పి తెచ్చిపెడుతోంది.

నిన్నటివరకూ కత్తులు దూసుకున్న సమాజ్ వాదీ పార్టీ, బహుజనసమాజ్ పార్టీలు ఇప్పుడు కలిసి బీజేపి పై యుద్ధం ప్రకటించడంతో బీజేపి కి దిమ్మతిరిగి పోయింది.ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు బీజేపీకి ఈ రెండు పార్టీలు చుక్కలు చూపిస్తున్నాయి.

వీరి దెబ్బతో బీజేపీ బీజేపి కి కంచుకోటలుగా ఉన్న స్థానాలు సైతం బద్దలవుతున్నాయి.



గత ఉపఎన్నికల్లో గోరఖ్ పూర్, పుల్పూర్ స్థానాల ఫలితాలే బీజేపి పరిస్థితిని తేల్చి చెప్పేశాయి.ఎస్పీ-బీఎస్పీ ఏకమవడంతో… పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది…గత ఎన్నికల్లో ఎన్ని స్థానాలు అయితే గెలుచుకుందో ఈ సారి అంతకంటే ఎక్కువగా స్థానాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు.అయితే ఇప్పుడు ముందు ఉన్న సవాల్ ఒక్కటే గోరఖ్ పూర్ లోనే ఓడిపోతే.

వారణాశిలో గెలుస్తారా.? ఎందుకంటే అక్కడ ప్రధానమంత్రి నరేందరమోదీ ఎంపీగా గెలిచారు…అయితే వారణాసి బీజేపి కి పెద్ద పట్టున్న స్థానం కూడా కాదు.అయితే 2004లో అక్కడ కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలిచింది కానీ 2009లో బీజేపీ అభ్యర్థిగా మురళీ మనోహర్ జోషి ఈస్థానం నుంచీ అత్యంత స్వల్ప తేడాతో గెలుపొందారు.

అయితే 2014 ఎన్నికల్లో మాత్రం మోడీ హవా ఎక్కువగా ఉండటం సోషల్ మీడియా బయట మీడియా లో భారీ ప్రచారం ఉండటంతో పాటు కుల సమీకరణాలు సైతం మోడీ గెలుపుకు కారణం అయ్యాయి.

అయితే ఇప్పుడు ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా మారింది.మోడీ హవా తగ్గింది అని చెప్పడానికి ఇప్పుడు ఉన్న పరిస్థితులు కారణం అని చెప్పవచ్చు.అంతేకాదు అక్కడ గెలుపు ఓటమిలు డిసైడ్ చేసే కుల సమీకరణాలు ఇప్పుడు పూర్తిగా ఎస్పీ, బీఎస్పీకి అనుకూలంగా మారాయి.సమాజ్ వాదీ పార్టీ అక్కడ ఎంతో బలంగా మారింది…

ఇదిలాఉంటే రెండేళ్ళ క్రితం వారణాసి పరిధిలో 48 జిల్లా పంచాయతీ స్థానాలకు గాను బీజేపి మద్దతు దారులు గెలుచుకుంది మాత్రం కేవలం 8 స్థానాలు మాత్రమే.

మోడీ అక్కడ దత్తత తీసుకున్న గ్రామంలో తప్ప పెద్దగా బీజేపి ప్రాభల్యం ఏమీ లేదు.రోజు రోజుకి మోడీ అక్కడ తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకుంటున్నాడు.

గత ఎన్నికల్లో మోడీ కి ఏమైతే కలిసి వచ్చాయో ఇప్పుడు అవే మోడీ ని ముంచుతున్నాయి… ఎస్పీ-బీఎస్పీ కలసి పోటీ చేస్తే మాత్రం మోడీ ఓటమి ఈ సారి తధ్యం అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube