బీట్ రూట్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిన విషయమే.దీనిలో ఉండే లుటైన్ అనే యాంటీఆక్సిడెంట్ చర్మానికి ఫ్రీ రాడికల్స్ కలిగించే నష్టాలతో పోరాటం చేస్తుంది.
చర్మానికి నష్టం కలిగించే ఫ్రీ-రాడికల్స్ తో పోరాడి అనేక రకాలుగా చర్మ సంరక్షణలో సహాయపడుతుంది.చర్మానికి పోషణను అందించడానికి బీట్ రూట్ ను వివిధ పద్ధతుల్లో వాడవచ్చు.
ఇప్పుడు బీట్రూట్ తో ఫేస్ పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
ఒక స్పూన్ బీట్రూట్ రసంలో అర స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.
విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.
బీట్రూట్ తురుముతో కలబంద గుజ్జు వేసి మెత్తని పేస్ట్ గాతయారుచేసుకోవాలి .ఈ పేస్ట్ ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే ముఖ ఛాయ మెరుగు అవుతుంది.
రెండు స్పూన్ల బీట్రూట్ రసానికి అర స్పూన్ వరి పిండి కలిపి ముఖానికి పట్టించి పావు గంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా నెలలో రెండు సార్లు వేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
ఒక స్పూన్ బీట్రూట్ రసంలో రెండు స్పూన్ల తేనే కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మానికి పోషణ అంది చర్మం కాంతివంతంగా ఉంటుంది.