జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాడు అంటున్నారు విశ్లేషకులు.ఏపీలో కొత్త పోరుకు సిద్దం అయ్యాడు.
ఏపీ విభజన జరిగేటప్పుడు విభజనకి విరుద్దంగా ఏ విధంగా అయితే జేఏసీలు ఏర్పడ్డాయో ఆ విధంగానే ఇప్పుడు విభజన హామేలని నెరవేర్చడానికి కొత్త పోరు సలిపాడు.తెలంగాణా ఉద్యమమే స్పూర్తిగా సాగుతున్న పవన్ కళ్యాణ్ అదే తరహాలో జాయింట్ యాక్షన్ కమిటీ ని ఏర్పాటు చేయనున్నాడు.
విభజన సమస్యలు, ప్రత్యేక హోదా హామీ, కేంద్రం వాటిపై అనుసరిస్తున్న వైఖరి పై పోరు చేయడానికి సిద్దం అంటున్నాడు.పవన్ ఏర్పాటు చేయబోయే జేఏసీలో ఉండవల్లి వంటి సీనియర్ రాజకీయ వేత్తలతోపాటు లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కూడా కలిసి పని చేస్తామని అంటున్నారు.
అంతేకాదు.పలు యునివర్సిటీ అధ్యాపకులు కూడా ఈ పోరులో భాగస్వాములు కానున్నారు.ఇంతవరకు అంత బాగానే ఉంది అయితే జేఏసీ ఏర్పాటు వెనుక రాజకీయ కోణం ఉందనేది మాత్రం ఒక్క బల్ల కాదు వంద బల్లలు గుద్ది మరీ చెప్పవచ్చు అంటున్నారు.ఇది వైసీపీ అధినేత జగన్‌కు అనుకూలంగా ఉండబోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ఈ జాక్ లో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లిని ఎంచుకోవడమే దీని వెనుక అసలు రీజన్…రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కి రాం రాం చెప్పిన ఉండవల్లి.క్రియాశీల రాజకీయాలకు మాత్రం దగ్గరగానే ఉన్నారు.
చంద్రబాబు సర్కార్ పై ఫైర్ అయిపోయే ఉండవల్లి.జగన్ పార్టీకి మద్దతు తెలపడం అనేక సందర్భాలలో చూస్తూనే ఉన్నాం అయితే ఇలాంటి సమయంలో పవన్ జేఏసీ లో ఉండవల్లికి చోటు ఇవ్వడం పట్ల అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇవన్నీ కూడా కేవలం జగన్‌కు మేలు చేకూర్చడమేనని అంటున్నారు అంతేకాదు పవన్ కల్యాణ్‌తో కలిసి పనిచేయాలని గత కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్ నిరీక్షిస్తున్నారు.పవన్ తోడు ఉంటే కాపుల ఓటింగ్ కూడా జగన్ కి కలిసొచ్చే అంశం అని చెప్పవచ్చు.
అందుకే జగన్ పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేయరు…అయితే ఇప్పడు జేఏసీ ఏర్పాటు కూడా జగన్ కి మైలేజ్ తీసుకురావడానికే అనేది విశ్లేషకుల అభిప్రాయం.మరి ఎన్నికల చివరి వరకూ ఎవరు ఎవరితో జట్టుకడుతారో తెలియని పరిస్థితి నెలకొంది ఏపీ రాజకీయాలలో.