నవంబర్ నెలలో పుట్టినవారు “ముక్కుసూటితత్వం” కలిగి ఉంటారు.వీరికి తొందర మరియు కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది.
వీరి తొందరితనం,కోపం కారణంగా ఇతరులతో శత్రుత్వం కొని తెచ్చుకుంటారు.వీరు ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని లెక్కచేయకపోవటం వలన అనేక అనర్ధాలకు దారి తీస్తుంది.
వీరికి తెలివితేటలు, ఆకర్షణా శక్తి, ధైర్యం, పట్టుదల, ఆత్మవిశ్వాసం, కోపం మరియు కోరికలు కూడా ఎక్కువ.బాగా బతకటం కోసం అన్నీ కావాలనుకుంటారు.అనుకున్న దాని కోసం బాగా ఎక్కువగా కష్టపడతారు.అన్నిటిలోనూ తమదే పైచేయిగా ఉండాలని ఎంత శ్రమ చేయటానికి అయినా వెనకాడరు.
కోరుకున్న దాన్ని సాధించటం కోసంఎంత కష్టం చేయటానికి అయినా వెనకడుగు వేయరు.
వీరు అసలు సోమరిగా ఉండరు.
వీరిలో త్యాగబుద్ధి ఎక్కువ.వీరు స్వయంగా చేసే కొన్ని తప్పుల కారణంగా ఎక్కువగా ఇబ్బందులకు గురవుతుంటారు.
ఇతరులను తొందరగా నమ్మి మోసపోతుంటారు.వీరిలో నీతి నిజాయితీ ఉంటుంది.
భగవంతునిపై నమ్మకం ఉంటుంది.
ఆచారాలు, సంప్రదాయాలు తప్పనిసరిగా పాటిస్తారు.తీర్ధయాత్రలు, దైవ దర్శనాలు చేస్తూ నలుగురికి సహాయం చేస్తుంటారు.వ్యాపా రాలు, పరిశ్రమలు స్థాపించి నలుగురికీ ఉపాధిని కల్పిస్తారు.
సంఘంలో పలుకుబడి సంపాదించి కీర్తి ప్రతిష్టలతో గౌరవంగా బ్రతుకుతారు.సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసు కుంటూ నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు.
వీరు రాజకీయాలలోనూ, వ్యాపారాల్లోనూ బాగా రాణిస్తారు.వీరు గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటారు.
ఆరోగ్యం : మొలలు, కిడ్నీ వ్యాధులు రావచ్చు.ధనము : వీరి చేతిలో ఎప్పుడు ధనం ఉంటుంది.లక్కీ వారములు : సోమవారము, శుక్రవారము.లక్కీ కలర్ : పసుపు, ఎరుపు, ఆకుపచ్చ.లక్కీ స్టోన్స్ : పగడం, ముత్యం మరియు ఆకుపచ్చ స్టోన్ .