ఈ రాశుల వారు భయంకరమైన టార్చర్... వీరిని భరించటం ఎలా?

కొంత మంది ఎదుటి వారిని అసలు పట్టించుకోకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు.ప్రతి చిన్న విషయాన్నీ చాలా పెద్దదిగా చేసి రచ్చ రచ్చ చేసిస్తూ ఉంటారు.

 These 6 Zodiac Signs Get Easily Confused About Everything-TeluguStop.com

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు తమకు ఇష్టం వచ్చినట్టు ఉండి ఇతరుల మాటను అసలు వినక విపరీతమైన టార్చర్ పెడుతూ ఉంటారు.వీరి కారణంగా ఇబ్బంది పడినా పెద్దగా ఎవరు పట్టించుకోరు.

వీరు మంచివారే…కానీ కాస్త జాగ్రత్తగా మెలగాలి.ఇప్పుడు ఏ రాశుల వారు టార్చర్ పెడతారో తెలుసుకుందాం.

తుల రాశి
ఈ రాశి వారు పక్కన ఉన్నవారిని ఇబ్బంది పెట్టటమే కాకుండా వారి కంగారులో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని గందరగోళం చేసేస్తారు.వీరితో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తే వీరి నుంచి తప్పించుకోవచ్చు.

కుంభ రాశి
ఈ రాశి వారు వాస్తవానికి విరుద్ధంగా ఊహల్లో విహరిస్తూ ఉంటారు.వీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికీ తెలియదు.

వారి కోణంలో చూస్తే వారే చాలా మంచివారు.కానీ ఎదుటి వారికీ మాత్రం చాలా డేంజర్.

వృశ్చిక రాశి
ఈ రాశి వారు రహస్యాలను బయట పెట్టకుండా ఉంటారు.పక్కవారికి అసలు విషయాన్నీ చెప్పకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు.మనస్సులో విషయాన్నీ బయట పెట్టకుండా మరీ పక్కన వారిని టార్చర్ పెడుతూ ఉంటారు.వీరు ఎప్పుడు వారికీ అనుకూలంగా జరగాలని అనుకుంటారు.

పక్కవారికి మేలు జరుగుతుందని అంటే అసలు తట్టుకోలేరు.కాబట్టి ఈ రాశి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.


మిధున రాశి
ఈ రాశి వారు ఏమి ఆలోచించకుండా ఏమి అన్పిస్తే అది చేసేస్తూ ఉంటారు.వీరి ప్రవర్తన విసుగు కలిగిస్తుంది.వీరిని అర్ధం చేసుకోవటం చాలా కష్టం.ఒక్కోసారి పక్కన ఉన్నవారిని విపరీతమైన టార్చర్ పెడతారు.

కర్కాటక రాశి
వీరు శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు.వీరు ఉన్న విషయాన్నీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు.

దాంతో అవతలి వ్యక్తులు బాధపడతారు.వీరి మనస్సు మంచిదే కానీ కాస్త దురుసుగా మాట్లాడతారు.

ధనస్సు
ఈ రాశి వారు మాట్లాడే ముందు గాని, ఏదైనా పని చేసే ముందు గాని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు.నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తారు.ఏమి చేయాలనీ అనిపిస్తే అదే చేసేస్తారు.వీరి కారణంగా ఎవరు ఇబ్బంది పడిన అసలు పట్టించుకోరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube