ఏపీ సీఎం చంద్రబాబు కి త్వరలోనే ఎమ్మెల్యేలు షాక్ ఇవ్వనున్నారు అని తెలుస్తోంది.అయితే ఆ ఎమ్మెల్యేలు కూడా వైసీపి నుంచీ టిడిపిలోకి వచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కావడం గమనార్హం.
అయితే ఈ విషయంలో ఓ స్పష్టమైన విషయం రాకపోయినా దాదాపు మల్లి 15 మంది ఎమ్మెల్యేలు తమ సొంత గూటికి చేరనున్నారు అని తెలుస్తోంది.ఇదిలా ఉంటే అటువంటి వారు మళ్లీ వైసీపిలోకి రావచ్చు అంటూ జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
అయితే జగన్ ఇచ్చిన ఈ ఆఫర్ ని ఎమ్మెల్యేలు ఎలా ఉపయోగించుకుంటారో తెలియదు కానీ.జగన్ మాత్రం ఈ ఆఫర్ లో ఓ చిన్న మెలిక పెట్టాడు…ఇంతకీ విషయం ఏమిటంటే, వైసిపి నుండి 23 మంది ఎంఎల్ఏలు టిడిపిలోకి ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే.ఫిరాయించిన వారందరికీ టిడిపి నేతలు ఆఫీస్ లో బాయ్ లా చూస్తున్నారని చాల ఘోరమైన అవమానాలు ఎదుర్కుంటున్నామని వాపోతున్నారట.తాము టిటిపిలోకి ఫిరాయించి తప్పు చేశామని కాబట్టి తిరిగి వైసిపిలోకి వచ్చేస్తామని కొందరు ఫిరాయింపు ఎంఎల్ఏలు జగన్ కు సంకేతాలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే.
టికెట్లు ఇచ్చే సమయంలో కూడా ఫిరాయింపు నేతల్ల్లో చాలామందికి టిక్కెట్ ఉండదని తెలుస్తోంది.అందుకే కొందరు నేతలు టిడిపి నుంచీ మళ్లీ వైసీపిలో వచ్చేయడానికి రంగం సిద్దం చేసుకున్నారని తెలుస్తోంది.
అయితే జగన్ కూడా సదరు ఎమ్మెలేలు వస్తానంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటున్నారు.అయితే ఇక్కడ చిన్న మెలిక పెట్టారని వచ్చే వాళ్ళపై జగన్ కి నమ్మకం ఉంటేనే వారికి పార్టీలో అనుమతి ఉంటుందని అంటున్నారట జగన్.







