వంటకు ఏ ఆయిల్ వాడితే మంచిదో చాలా మందికి తెలియక ఎదో ఒక నూనెను వాడేస్తూ ఉంటారు.అయితే సరైన నూనెను ఎంపిక చేసుకొని వాడితే చాలా అనారోగ్య సమస్యలు దరికి చేరవు.
అంతేకాక నూనెల కారణంగానే మన శరీరంలో కొలస్ట్రాల్ పెరుగుతుంది.ఇప్పుడు ఏ నూనె వాడితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటామో తెలుసుకుందాం.
అలాగే ఏ నూనెలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో కూడా వివరంగా తెలుసుకుందాం.
వేరుశనగ నూనె
పూర్వం మన పెద్దవారు ఎక్కువగా వేరుశనగ నూనెను వాడేవారు.
ఈ నూనె మన ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది.ఈ నూనె వాడటం వలన ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడటమే కాకుండా మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
అవకాడో నూనె
అవకాడో నూనెలో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.ఎక్కువ స్మోక్ చేసేవారికి ఈ ఆయిల్ బెస్ట్ ఆయిల్.అవకాడో ఆయిల్ ని సలాడ్ డ్రెస్సింగ్ కి ఎక్కువగాఉపయోగిస్తారు .
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా బరువు తగ్గాలని అనుకునేవారికి మంచి నూనె అని చెప్పవచ్చు.ఆలివ్ ఆయిల్ లో కొలస్ట్రాల్ తక్కువగాను యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగాను ఉండుట వలన మధుమేహం,గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో కొలస్ట్రాల్ అసలు ఉండదు.వంటలలో మితంగా వాడుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.జీర్ణక్రియను పెంచుతుంది.అలాగే ఎనర్జీ ని పెంచుతుంది.
బాదం నూనె
బాదం నూనెలో విటమిన్ E, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉండుట వలన వంటలలో కన్నా ఎక్కువగా మఫిన్స్ ,కేక్ ,బిస్కెట్స్ బేక్ చేయటానికి వాడుతూ ఉంటారు.
నువ్వుల నూనె
నువ్వుల నూనెను వంటల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పవచ్చు.
నువ్వుల నూనెను మన పూర్వీకుల తరం నుండి ఇప్పటి తరం వరకు వాడుతూనే ఉన్నారు.ఈ నూనెలో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన కొలస్ట్రాల్ ని తగ్గించటంతో గుండె జబ్బులు,రక్తపోటులను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
సన్ ఫ్లవర్ ఆయిల్
సాధారణంగా చాలా మంది వంటలకు ఈ నూనెను వాడుతూ ఉంటారు.ఈ నూనెలో విటమిన్ ఎక్కువగా ఉండుట వలన ఆర్థరైటిస్ సమస్య నుండి బయట పడవచ్చు.
ఆవ నూనె
ఈ నూనెలో మోనో అన్ శాట్యురేటెడ్ మరియు పాలీ అన్ శాట్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉండుట వలన గుండె జబ్బులు రావు.