నవ్యాంధ్ర ని అభివృద్ధి పదంలో నా ధ్యేయం.ఏపీలో నిరుద్యోగులకి ఉపాధి కల్పించడమే నాకల.
ఏపీలో ఐటీ ని విస్తృత పరుస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యం అని చెప్తూ ఆ దిశగా ముందుకు దూసుకుపోతున్న ఏపీ ఐటీ శాఖామంత్రి నారా లోకేష్.ఆ కలలని నిజం చేస్తున్నారు.
సరిగ్గా నాలుగురోజుల క్రితం చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో జోహో సాఫ్ట్వేర్ కంపెనీని ని ప్రారంభించిన నారా చంద్రబాబు నాయుడు.సుమారు 250 కోట్లతో లక్షల మంది ఐటీ నిపుణులని తీర్చి దిద్దుతాను అని మాట ఇచ్చారు.
వారు శిక్షణ పూర్తీ చేసుకుని బయటకి వచ్చేలోగా ఐటీ కంపెనీలు ఎపీకి వస్తాయని.ఏపీలో ఒక్కో కుటుంభానికి ఒక ఐటీ నిపుణుడు ఉండేలా చేసే భాద్యత నాది అని చెప్పారు.
అయితే దానికి తగ్గట్టుగానే.ఏపీ ఐటీ శాఖామంత్రి లోకేష్ బుధవారం ఒకే రోజున సుమారు 16 ఐటీ కంపెనీలని ప్రారంభించనున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఒకేరోజున 16 ఐటీ పార్కులు ప్రారంభంకానున్నాయి.రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ ఐటీ కంపెనీలను ప్రారంభించనున్నారు…ఈ ఐటీ కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి…సిగ్నం డిజిటల్ నెట్‌వర్క్, చారు వికెంట్ ఐటీఈఎస్, అద్వైత్ అల్గారిథం, స్క్రిఫ్ట్ బీస్, స్వరా సాఫ్ట్, సన్‌స్వెట్, పిక్సీ, సువిజ్, డీఎఫ్‌ఐ స్విస్,ఎక్సెల్లార్, మెక్ మై క్లినిక్, బీవీజీ ఇండియా కంపెనీలు ఈరోజు నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి.