వైసీపి తో టచ్ లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు

ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు.ఈ రోజు జగన్ ని తిట్టిన నేతలు రెండు రోజుల తరువాత జగన్ కి జై కొడుతారు.

 Two Senior Tdp Leaders Looking Into Ysrcp-TeluguStop.com

ఇప్పుడు ఏపీలో పరిస్థతి అలాగే ఉంది.ఆపరేషన్ ఆకర్ష అంటూ బాబు వైసీపిలో ఉన్న చచ్చు పుచ్చులని సైకిల్ ఎక్కించు కుంటున్నారు.

ఇది జగన్ కి బాగా కలిసొచ్చింది.ఎందుకంటే వాళ్ళని జగన్ పోమ్మనలేదు.

ఉంటే పదవులు కట్టబెట్టలేడు.సో అలాంటి వాళ్ళని సైలెంట్ చేస్తే వాళ్ళు అసంత్రుప్తి అంటూ వాళ్ళకి ఉన్న చీడని సైకిల్ ఎక్కి బాబు కి అంటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటివరకూ ఒక లెక్క ఇక్కడి నుంచీ మరోలేక్క అంటున్నాడు వైఎస్ జగన్.సైకిల్ ఎక్కుతున్న వాళ్ళు ఒకే మరి సైకిల్ దిగి ఫ్యాన్ కింద కూర్చునే వాళ్ళ సంగతి ఏంటి మరి అంటున్నారు వైసీపి నాయకులు.

ఇప్పటికే ఎంతో మంది మాతో టచ్ లో ఉన్నారని అంటున్నారు.వారిలో కొంతమంది.ఆ లిస్టు లో ముందుగా బాబు కి చిత్తూరు నుంచే షాక్ ఇవ్వనున్నాడు జగన్.ఇద్దరు టిడిపి సీనియర్స్ అందులోనూ మాజీ మంత్రులు అయిన గాలి ముద్దు కృష్ణమనాయుడు ,బొజ్జల గోపాలకృష్ణ ఫ్యాను గాలి కావాలి అంటున్నారట.

ఈ ఇద్దరు సీనియర్ లీడర్స్ పుత్ర రత్నాలు ఎన్నికల్లో పోటీ చేయాలని రంగం సిద్దం చేసుకుంటున్నారు.అందులో భాగంగానే ఇద్దరూ కూడబలుక్కునే వైసిపి నేతలతో టచ్ లో ఉన్నారన్న విషయంపై టిడిపిలో పెద్ద చర్చ జరుగుతోంది…ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డిలకు నగిరి, శ్రీకాళహస్తిలో టిక్కెట్లు వచ్చేది అనుమానమే.

దానికి కారణం వయసు, మరే కారణాలో చూపించి టిక్కెట్లపై వారికి చంద్రబాబునాయుడు కూడా హామీ ఇవ్వలేదట.

అందుకనే ఇద్దరు మాజీ మంత్రులు కూడా తమ నియోజకవర్గాల్లో తమ పిల్లలకు టిక్కెట్లు ఇవ్వమని చంద్రబాబును అడిగారు.

దానికి కూడా ఊహు అన్న బాబు ఇక దయచేయండి అన్నట్టుగా తల ఊపారట.ఈ పరిణామాలతో ఖంగు తిన్న ఇద్దరు లీడర్స్ ఇప్పటి నుండే వైసిపి నేతలతో కూడా టచ్ లో ఉన్నారట.

ఒకవేళ తమ పిల్లలకు టిడిపిలో పోటీ చేసే అవకాశం రాకపోతే వెంటనే వైసిపిలో చేరి టిక్కెట్లు తెచ్చుకోవాలన్నది మాజీ మంత్రుల ఆలోచనగా టిడిపిలో చర్చ జరుగుతోంది.అయితే ఇప్పటి వరకూ వైసీపి కోసం అలుపెరుగ కుండా పని చేస్తున్న వారిని కాదని ఇప్పుడు వీళ్ళ ఇద్దరికీ టికెట్స్ ఇవ్వడం జరిగే పని కాదు.

ఎందుకంటే…నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజాకి ఇంటా , బయట కూడా మంచి పట్టు ఉంది అంతేకాదు రోజాకు ఫైర్ బ్రాండ్ గా పేరుంది.సో రోజాను కాదని ముద్దు కృష్ణమనాయుడు కొడుకు భానుప్రసాద్ కు జగన్ టిక్కెట్టిచ్చేది అనుమానమే.

అయితే వైసీపితో సదరు నేతలు టచ్ లో ఉన్నారా లేదా ఉట్టి ప్రచారమేనా అనీ టిడిపిలో మాత్రం పెద్ద చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube