కర్ణుడి చావుకి వెయ్యి కారణాలు అంటారు.అయితే చంద్రబాబు కి వచ్చే ఎన్నికల్లో పారాజయం చవి చూడటానికి మాత్రం ఈ ఏడూ కారణాలు చాలు అంటున్నారు విశ్లేషకులు.2019 ఎన్నికల్లో కూడా మళ్ళీ తిరిగి అధికారాన్ని దక్కించుకోవడానికి ఎంతో ప్రయతిస్తున్నారు బాబు.అందుకు తగ్గట్టుగా ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ వచ్చారు.
అయితే రాకకీయంగా అభివృద్ధి ని పక్కన పెట్టి వైసీపిని దెబ్బ కొట్టే పనిలో భాగంగా బాబు చాలా తప్పటడుగులు వేశారనే చెప్పాలి.అయితే ఇప్పుడు అవే బాబు పాలిత శాపాలుగా మరి అధికారాన్ని కోల్పోయేలా చేసే అవకాశం ఉంది అంటున్నారు.
మరి చంద్రబాబు చేసిన బిగ్ మిస్టేక్స్ ఏమిటో మీరు చుడండి.
ఫిరాయింపుల గాలం ఎఫెక్ట్ వైసీపి అధినేతకి తగిలిందో లేదో కానీ చంద్రబాబు కి మాత్రం గట్టిగానే తగిలింది అని చెప్పాలి.
ఈ విషయంలో బాబు పెద్ద తప్పు చేశారు అనే విషయాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళడంలో జగన్ సక్సెస్ అయ్యారు ప్రజలు కూడా ఎంతో హుందాగా ఉండే చంద్రబాబు ఇలా చేశారు ఏంటి అని అనుకున్నారు…2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైసిపిని దెబ్బకొట్టటం ఎలాగ అన్న విషయంపైనే దృష్టి పెట్టిన బాబు.ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టేందుకు ప్రయోగించిన ఫిరాయింపుల ప్రయోగం జాతీయ స్ధాయిలో అపఖ్యాతిని తెచ్చిపెట్టింది.
అసలు చంద్రబాబు కి ప్రజలు ఓట్లేయడానికి 80 % కారణం ఒక్కటే అనుభవం ఉన్న వ్యక్తి.హైటెక్ సిటీ లాంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు అని.అదే కోణంలో రాజధాని నిర్మాణం తన వల్లే అవుతుందని.పోలవరం టిడిపి మాత్రమే పూర్తి చేయగలదు అంటూ ప్రచారం చేసి గద్దె నెక్కిన బాబు.
అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళవుతున్నా పోలవరం, రాజధాని నిర్మాణం సంగతి.గ్రాఫిక్స్ లో చూపిస్తున్నారు తప్పితే ప్రయోజనం మాత్రం సూన్యం అనే చెప్పాలి.
పోలవరం నిర్మాణంలో అయితే చేతులు ఎత్తిసిన పరిస్థితి ఉంది.
ఎన్నికల్లో మరొక ప్రధానమైన అంశం.
ప్రత్యేకహోదా సాధన.ఈ విషయంలో మాత్రం బాబు చాలా ఘోరంగా విఫలం అయ్యారు అనే చెప్పాలి.
ప్రత్యెక హోదా తెస్తాను అన్న బాబు.కేంద్రంతో పోటీ పడలేక హోదా వస్తే ఎంత రాకపోతే ఎంత అంటూ స్వరం మార్చేశారు.
అయితే.వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రప్రయోజనాలను సైతం పణంగా పెట్టటంతో జనాలు మండిపోతున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్నది మిత్రపక్షమే అయినప్పటికీ రాష్ట్రప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారనే చెప్పాలి…రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంతకైనా వెళ్తా అనే బాబు సినిమా డైలాగులులా పరిమితమై పోయారు.
ఓటుకు నోటు కేసు చంద్రబాబు రాజకీయ జీవితంలో మాయని మచ్చ అనే చెప్పాలి చ.ద్రబాబుపై గతంలో ఉన్న కేసులు అన్నీ ఒక్కటి, ఓటుకునోటు కేసు ఒక్కటి.ఈ కేసులో అరెస్టుకు భయపడే పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను అర్ధాంతరంగా వదిలి పెట్టేసి విజయవాడకు మకాం మార్చేసారు.
దాంతో విభజన హామీలపై గట్టిగా కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితి చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఏర్పడింది అని చెప్పచ్చు.
ఒకప్పటి చంద్రబాబు వేరు ఇప్పటి చంద్రబాబు వేరు అనడానికి సరైన సమాధానం ఒక్కటే పార్టీలో గ్రూపు తగాదాలు జిల్లాల వారీగా నేతల మధ్య లేని సఖ్యత.
క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచినా తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చంద్రబాబు మాట వినే వాళ్ళు ఆయన చూపులకి బయపడే వాళ్ళు చాల తక్కువ.ఇద్దరు నేతలని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు అనేది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు.
చంద్రబాబు రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా చక్రం తిప్పేవారు.వాజ్పేయి లాంటి వాళ్ళు సైతం చంద్రబాబు కి ఎంతో విలువ ఇచ్చేవాళ్ళు.ఎంతో మంది ముఖ్యమంత్రులకి ఆదర్శంగా ఉండే బాబును ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోడి పూర్తిగా దూరం పెట్టేసారు.గడచిన ఏడాదిన్నరగా ప్రధానమంత్రి అపాయిట్మెంట్ ను చంద్రబాబు సాధించలేకపోతున్నారంటేనే చంద్రబాబు పరిస్థితి ఏంటో తెలుస్తోంది.
ఇక ఆఖరి అంశం ప్రజా వ్యతిరేకత.ఇప్పుడు బాబుకి నిద్రలేకుండా చేస్తున్న విషయం ఇదొక్కటే.ఈ సారి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తన తనయుడికి పట్టం కట్టించాలి అనుకున్న చంద్రబాబు కి అడ్డు వేసేది ప్రజా వ్యతిరేకత విభజన హామీల అమలులో విఫలం, ఎన్నికల హామీల అమలులో విఫలం, జిల్లాల వారిగా టిడిపి ప్రజా ప్రతినిధుల రౌడి పాలన.అడ్డు వచ్చిన వారిని కొట్టించడం.
కులాల మధ్య చిచ్చు.స్వార్ధ ప్రయోజనం కోసం.
వేస్తున్న తప్పటడుగులు అన్నీ.జనాల్లో చంద్రబాబు పాలనపై బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది.
ఏది ఏమైనా సరే ఈ సారి ప్రజాభిమానం సంపాదించడం మాత్రం చాలా కష్టమే అంటున్నారు విశ్లేషకులు.








