సొంత జిల్లాలోనే బాబుకి షాక్....వైసీపిలోకి టిడిపి సీనియర్ నేత

చంద్రబాబు ఒక పక్క వైసీపి వాళ్ళని టిడిపిలోకి ఆహ్వానిస్తూ జగన్ కి షాక్ ఇస్తూ ఉంటే.జగన్ మాత్రం ఎకంగా చంద్రబాబు సొంత జిల్లాలో నేతలని తన పార్టీలోకి ఆహ్వానిస్తూ చంద్రబాబు కి బిగ్ షాక్ ఇస్తున్నాడు.

 Ap Cm Chandrababu Gets Shock From Own District-TeluguStop.com

ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతున్న విషయం ఏమిటి అంటే చిత్తూరు జిల్లా సీనియర్ టిడిపి నాయకుడు సుభాష్ చంద్రబోస్ పార్టీ మారుతున్నారు? అని ఇది చిత్తూరు జిల్లాలో ఉన్న టిడిపి నేతలకి గుబులు పుట్టిస్తోంది.అయితే పార్టీ మారితే బీజేపి కి వెళ్తారా లేక వైసీపికా అనేది క్లారిటీ లేదు.

కానీ ఎక్కువగా ఆయన చూపు మాత్రం వైసీపి వైపే ఉంది అని సమాచారం.

అసలు అంత పెద్ద సీనియర్ నేత పార్టీ మారడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే.

టిడిపి సీనియర్ నేత సుబాష్ చంద్రబోస్ పార్టీ మారడానికి కారణం వైసీపి నుంచీ టిడిపిలోకి జంప్ అయిన అమర్నాద్ రెడ్డి అంటున్నారు.వైసీపి నుంచీ ఎమ్మెల్యేగా వచ్చి ఇక్కడ మంత్రి అయిన అమర్నాథ్ సుబాష్ జోష్ కి బ్రేకులు వేస్తున్నారట ఆయన ప్రాభల్యం పెంచుకోవడానికి సుబాష్ ని ప్రాముఖ్యం తగ్గిస్తున్నారట.

ఈ విషయాన్ని గమనించిన సుబాష్ పార్టీ పరంగా జరిగే కార్యక్రమాలకి హాజరు కావడంలేదు అంటున్నారు…శుక్రవారం జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి.తరువాత జరిగిన బహిరంగ సభకి సుబాష్ హాజరు కాలేదు.

టీడీపీ రాష్ట్ర కోశాధికారిగా, రాష్ట్ర కార్యవర్గంలో చోటున్న తనకి పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం తమనేతకు ఇది పెద్ద అవమానం అంటున్నారు అనుచరులు.

అంతేకాదు బోస్ ని పార్టీ ఇంచార్జ్ పదవి నుంచీ తప్పించారు.

ఆ తరువాత తన కార్యాలయంపై ఐటీ దాడులు చేశారు.ఇదంతా తనకు 2019లో టికెట్ ఇవ్వకుండా ఉండేందుకుకే అంటూ ఫిక్స్ అయిన సుబాష్ టిడిపి కార్యక్రమాలకి చాలా దూరం ఉంటున్నారు.

ఈ సారి టికెట్ ఇస్తారు అనే ఆశ బోస్ లోను తన వర్గం లోను లేదు అందుకే ఇప్పుడు పార్టీని వీడమని అనుచరులు సైతం చెప్పడం.సుబాష్ కూడా అనుచరుల మాటలకి ఒప్పుకోవడం జరుగుతోందని టాక్.

అయితే త్వరలోనే కార్యకర్తలతో భేటీ అయ్యి వైసీపికి వెళ్ళే ఆలోచన చేస్తున్నారు అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube