పురంధరేశ్వరి.ఎన్టీఆర్ కుటుంభం నుంచీ చంద్రబాబు కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా అనుకుంటే అది ఒక్క పురంధరేశ్వరి మాత్రమే.
కేంద్రం ఏపీ ప్రభుత్వాన్ని పోలవరం పనులు ఆపేయండి అంటూ లేఖని పంపడం వెనుకాల ఏపీ బిజెపి నేతల హస్తం ఉందనేది టిడిపి నాయకుల వాదన.అందుకు తగ్గట్టుగానే బిజెపి నేతలు కూడా కేంద్రం లేఖ తరువాత టిడిపిపై వ్యాఖ్యల వైనం అందుకు నిదర్సనంలా కనిపించింది.
ఇప్పుడు బిజేపి నాయకురాలు ఎన్టీఆర్ కుమార్తె అయిన పురంధరేశ్వరి కూడా బాబు పై వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.కేంద్రం లేఖ విషయంలో పురంధరేశ్వరి పాత్ర ఎంతవరకూ ఉందో అర్థం అవుతోంది అంటున్నారు టిడిపి నాయకులు.
మొదటి నుంచీ పురంధరేశ్వరి చంద్రబాబు కి వ్యతిరేకంగానే పావులు కదుపుతూనే వస్తున్నారు.ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ నీటి ప్రాజెక్ట్ ల విషయంలో కూడా.
తప్పులు ఎప్పుడు దొర్లుతాయి అన్నట్టుగాప్రాజెక్టులని సతీసమేతంగా విజిట్ చేశారు.అక్కడ ఎటువంటి ఆరోపణలు చేసే అవకాశం లేకపోయింది ఆమెకి.పోలవరంపై బిజెపి అధిష్టానానికి ఎపీకి క్లారిటీ వస్తోంది అనుకున్న సమయంలో ఇప్పుడు పురంధరేశ్వరి మాట్లాడిన మాటలు హీట్ రేపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు లెక్కలు చూపడం లేదు.
మీరు సరిగా లెక్కలు చూపలేదు కాబట్టే కేంద్రం పోలవరం నిధుల విషయంలో ఆలోచనలో పడింది అంటున్నారు.చంద్రబాబుని టార్గెట్ చేస్తూ పోలవరంపై మాట్లాడిన మాటలు ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి.
కేంద్రానికి సరైన లెక్కలు పంపకుండానే అవసరమైన నిధులు విడుదల చేయటం లేదని కేంద్రంపై నిందలు వేయడం సరికాదని మండిపడ్డారు.టిడిపి తమకు ప్రతిపక్షమా? మిత్రపక్షమా?.నిన్నని వరకూ నిధులు సమకూర్చిన కేంద్రం ఇప్పుడు ఎందుకు అడ్డు చెప్పిందో మీకు అర్ధం కాకపోయినా ప్రజలకి అర్థం అవుతుంది అంటున్నారు.ఏపీలో బిజెపి బలపడటానికి గుజరాత్ ఎన్నికలు ఉపయోగపడుతాయి అన్నారు పురంధరేశ్వరి.







