ఎన్నికలు ఎంతో దూరంలో లేవు.టైం దగ్గర పడుతోంది.
ఎన్నికల వాతావరణం మాత్రం చాలా హీట్ గా ఉంది.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎటువంటి పార్టీ అయినా సరే విజయం సాధించాలి అంటే.
క్రింది స్థాయి నేతల నుంచి మంత్రుల వరకూ అందరూ ఎంతో కష్టపడి నిజాయితీగా పని చేయాల్సిందే.అందరి కంటే ముఖ్యంగా…పార్టీ కార్యకర్తలు ఎంత కష్టపడితే అంత ఫలితం.
అయితే ఇప్పుడు నేతల భవితవ్యం కూడా కార్యకర్తల చేతుల్లోనే ఉంది.ఎలా అంటుకుంటున్నారా.
ఎన్నికల సమయంలో బాబుకి సర్వేలు చేయించడం కొత్తేమి కాదు అయితే ఈ సారి మాత్రం సర్వేలని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారట.కార్యకర్తలు.
ప్రజల నిర్ణయం ఎలా ఉందో తెలుసుకుని వారి నిర్ణయం ప్రకారం చంద్రబాబు టికెట్స్ పంపకం ఉంటుంది అంటున్నారు
అయితే ఈ సర్వేలో తీవ్ర వ్యతిరేకతతో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలన.నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లను పక్కన పెట్టే ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది.
సిట్టింగ్ ఎంపీలు.ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లలో ఎవరు వీక్‌గా ఉన్నారో గుర్తిస్తున్నారని సమాచారం.
ఇటీవల బయటకు వచ్చిన సర్వే ప్రకారం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో 51 మంది సిట్టింగ్‌లను పక్కన పెట్టేస్తారని వార్తలు వస్తున్నాయి.వీరిని పక్కన పెట్టేందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
చాలా మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తుంటే సామాజిక సమీకరణలు, సీనియార్టీ దృష్ట్యా కూడా కొందరిని పక్కన పెట్టేయనున్నారు.ఇక విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పనితీరు సరిగా లేని వారిని పక్కన పెట్టి వారికి బదులుగా కొత్త వారిని, సమర్థులైన వారిని, యువకులను ఎంపిక చేస్తున్నారు
అంతేకాదు ఈ సర్వేలో నామినేటెడ్ పదవులు పొందిన వారు పార్టీ కోసం ఎలా పనిచేస్తున్నారు.
పొందని వారు ఎలా పని చేస్తున్నారు అంటూ ఆరాలు తీస్తున్నారట.నాయకుల పని తీరు ప్రాంతాల బట్టి ఉంటోందా.
ఒక వర్గం వారికే సపోర్ట్ చేస్తున్నారా.అంతర్గతంగా ఉన్న గొడవలు ఏమిటి.
వాటి వల్ల ఎటువంటి ప్రభావం నాయకుల మీద ఉంది ఇలా ఒక పెద్ద లిస్టు తోనే ఈ సర్వే ఉంటుదని అని చెప్తునారు…ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడు ఎవరు.సామాజిక అంశాలపై ఎంత పట్టు ఉంది…వాక్చాతుర్యం.
పార్టీ పట్ల విధేయత.ఆర్థిక సామర్ధ్యం ఇలా ఒకటేమిటి అనేక రకాలుగా అన్ని కోణాల్లో నాయకుల మీద పరీక్షలు జరుగుతున్నాయి
అంతేకాదురాజకీయాలతో సంభందం లేని వ్యక్తులు.
సేవా కార్యక్రమాలు చేస్తూ.లోకల్ గా తమ కులాల మీద పట్టు ఉన్న వ్యక్తులు ఎవరు అనే కోణంలో కూడా నియోజకవర్గాల వారీగా సర్వే ఉంటుదట.
ఈ విషయం తెలుసుకున్న నేతలలో చాలా మందకి గుబులు అప్పుడే మొదలయ్యిందని.ఎవరు ఉంటారో ఎవరు ఊస్టింగో తెలియక తెగ టెన్షన్ పడిపోతున్నారట సిట్టింగులు.
మరి చంద్రబాబు సర్వే ఎంత మందకి ఎసరు పెడుతుందో.ఎంత మంది కొత్త వ్యక్తులని పార్టీకి పరిచయం చేస్తుందో వేచి చూడాలి మరి
.






