చంద్రబాబు కి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వనున్న ఏమ్మేలే

జగన్ పాదయాత్ర సందర్భంలో టిడిపి స్కెచ్ వేసి మరి వైసీపి వాళ్ళకి టిడిపి కండువా కప్పేస్తున్నాయి.ఒక పక్క చంద్రబాబు నానా తంటాలు పడి వైసిపిని ఎలా అయినా సరే దెబ్బ కొట్టాలని భావిస్తుంటే.

 Tdp Mla Going To Give Shock To Chandrababu-TeluguStop.com

ఇప్పుడు చంద్రబాబు సొంత ఎమ్మెల్యే బాబు మీద తిరుగుబాటు చేస్తున్నారు.ఈ పరిణామంతో ఒక్క సారిగా బాబుకి దిమ్మ తిరిగిపోయింది.

ఒక వేళ తాను కనుక టిడిపికి హ్యండ్ ఇస్తే టిడిపి పరువు గంగలో కలిపేసుకోవడమే అంటూ సీనియర్ మంత్రులు తెగ ఖంగారు పడుతున్నారు.అంతేకాదు తరువాత జరిగే పరిణామాలని ఊహించుకుంటేనే చంద్రబాబు కి నిద్రపట్టదు అంటున్నారు నేతలు.

ఇంతకీ బాబు ని ఇంతాలా కంగారు పెడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు?.ఆ నేతకి అంత సీన్ ఉందా?

ఉందా అంటే ఉందనే చెప్పాలి.పులి అడవిలో ఉన్నంతవరక దాని రాజసం వేరు.దానికి అదే రాజు.కానీ ఒక్క సరి బోనులో పడితే ఆడించే వాడు పెట్టిందే తినాలి.ఎవడో కొన్ని మెతుకులు వేస్తేనే దాని జీవనం సాగుతుంది.

ఒక్క సారి బోనులో నుంచీ మళ్ళీ అడవిలోకి వస్తే దాని రూటే సపరేటు.ఏంటి డైలాగులు అనుకుంటున్నారా.

ఇది నిజం ఈ మాటలు చెప్పేది ఒక సాధారణ ఎమ్మెల్యే గురించి మాత్రం కాదు ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి గురించి.బీసీల సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన ఆర్.క్రిష్ణయ్య ఇప్పుడు బోనులో ఉన్న పులి.ఒక్క సారి ఆ భందాలు తెంచుకుని మళ్ళీ బీసీ ఉద్యమాల్లోకి ఈ పులి దూకబోతోంది

కాపులకి రిజర్వేషన్లు కోసం చంద్రబాబు అసెంబ్లీలో బిల్లుని ఆమోదించారు.

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం కూడా జరిగిపోయింది.ఎప్పుడెప్పుడు టిడిపిని విడిచి మళ్ళీ తన సొంత ఉద్యమాల వైపు నడుద్దామా అనుకున్న ఆర్.కృష్ణయ్య కి మంచి టైం వచ్చేసింది అని భావించి.కాపు రిజర్వేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోరాటానికి సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

మరో అడుగు ముందుకు వేసి…ఏకంగా రాజీనామాకు సిద్ధపడ్డారు…టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో కలుపుతూ ఏపీ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు

కాపులను బీసీల్లో చేర్చితే బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆర్.కృష్ణయ్య అన్నారు.దీనిపై తాము న్యాయపరమైన పోరాటం చేస్తామని వెల్లడించారు.రాజకీయ లబ్ధి కోసమే ఏపీ తెలంగాణలో రిజర్వేషన్లను ప్రభుత్వాలు పెంచుతున్నాయని ఆరోపించారు.తెలుగు ప్రభుత్వాల నిర్ణయం రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధమన్నారు.బోయలను ఎస్టీల్లో కలిపితే అభ్యంతరం లేదన్నారు.

బీసీలకి అన్యాయం మీ నిర్ణయాలు ఎటువంటి అయినా సరే మా పోరాటం మాత్రం మీకు విరుద్దంగా జరుగుతుంది అని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube