జగన్ మోహన్ రెడ్డి ఒక పక్క ప్రజా సంకల్ప యాత్ర పేరుతో కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఉంటే.టిడిపి మరో వైపు కీలక నాయకుల్ని కర్నూలు నుంచీ సైకిల్ ఎక్కిస్తోంది .
చావో రేవో అన్నట్టుగా జగన్ పార్టీని ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు…ఒక వైపు సొంత పార్టీ నేతలే జగన్ ని నమ్మలేని పరిస్థితి నెలకొంది.ఎప్పుడు తన పార్టీలో ఏమి జరుగుతుందో జగన్ కే తెలియడం లేదు ఇక మిగిలిన నేతల పరిస్థితి వేరే చెప్పనవసరం లేదు.
అయితే ఇప్పుడు జగన్ కి మరొక తలనెప్పి వచ్చి పడుతోంది.అది కూడా సొంత వాళ్ళ నుంచీ అని టాక్
రాజాకీయాల్లో ఎటువంటి పోరు ఉన్నా పరవాలేదు కానీ ఇంటి పోరు మాత్రం ఉండకూడదు అంటారు.
ఇంటి పోరు మాత్రం మొత్తం రాజకీయ జీవితాలనే తలకిందులు చేస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.అదే నిజం కూడా.అసలే వైసీపిలో జంపింగ్ లతో సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డికి.ఇప్పుడు తాజాగా ఇంటిపోరు పెద్ద తలనెప్పిగా మారింది.
ఈ విషయంలో జగన్ రెడ్డి మాత్రం చాలా సతమతమవుతున్నారు అని టాక్
గత ఎన్నికల్లో వైసీపిలో జగన్ తరువాత చక్రం తిప్పింది సోదరి షర్మిలా.తల్లి విజయమ్మ.
జగన్ జైలులో ఉంటే పార్టీని నడిపించి అంతా తానై చూసుకున్న షర్మిల.తన పాదయాత్రతో వైసీపిలో ఊపు తెప్పించింది.
గత ఎన్నికలకు ముందు సోదరితో జగన్‌కు విబేధాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.కడప ఎంపీ సీటు తనకి ఇవ్వాలని జగన్ ని షర్మిల అడిగినా సరే అది అవినాష్ రెడ్డి కి ఇచ్చాడు జగన్.
గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి జగన్‌కు షర్మిల-ఆమె భర్త అనిల్‌కు మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది
ఇదే విషయం మీడియాలో కోడై కూస్తూ జగన్ ఫ్యామిలీ ఇష్యూ రచ్చ రచ్చ కావడంతో మా ఇద్దరి మధ్య విభేదాలు లేవు అన్నట్టుగా జగన్ షర్మిలని మళ్ళీ దెగ్గర తీసుకున్నాడు.అయితే షర్మిలకి పార్టీలో ప్రాధాన్యత మాత్రం లేకుండా పోయింది.
అన్న జైల్లో ఉన్నప్పుడు పార్టీకోసం ఎంతో కష్టపడ్డ షర్మిల ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు అన్నది వాస్తవం కూడా.ఇప్పుడు జరుగుతున్న అనూహ్యమైన పరిణామాలు వైసీపిలో ఇంటిపోరుని మరింతగా బయట పెడుతున్నాయి
నిన్నా మొన్నటి వరకూ తెరవెనుకే ఉన్న జగన్ భార్య భారతి ఇప్పుడు.
వైసీపిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.దీంతో షర్మిల కి పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోంది అని తెలుస్తోంది.
పారిశ్రామికవేత్తగానే ఉన్న జగన్ భార్య వైఎస్.భారతి డైరెక్టు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేయడం మాత్రం పక్కా అన్నట్టుగా ఉంటున్నాయి పరిస్థితిలు.
దానికి నిదర్సనంగానే ఆమె గిడ్డి.ఈశ్వరిని బుజ్జగించే ప్రయత్నం.
మరొక సంఘటన కూడా జగన్ షర్మిలని పక్కన పెడుతున్నారు అనే దానికి నిదర్సనంగా ఉంది.ఏమిటంటే పాదయాత్ర సమయంలో పీకే టీం నుంచీ వచ్చే ప్రతీ రిపోర్ట్ కేవలం జగన్ కి తన భార్య భారతికి మాత్రమే చెప్పాలని మిగిలిన ఎవ్వరికి చెప్పే అవకాశం లేదని చెప్పేశారట.
ఈ ఒక్క విషయం చాలు వైసీపిలో షర్మిల ప్రాధాన్యత తగ్గుతోంది భారతి హవా పెరుగుతోంది అని చెప్పడానికి అంటున్నారు విశ్లేషకులు.