రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ కుటుంభానిది చెరగని ముద్ర.దేశ రాజకీయాల్లో సైతం వైఎస్ కుటుంభానికి మంచి గుర్తింపు ఉంది.
రాజకీయాల్లో ఎన్నో చరిత్రలు సృష్టించిన వ్యక్తులు వాళ్ళు.కడప అంటే గుర్తొచ్చేది వైఎస్ ఫ్యామిలీనే.
ఆ జిల్లా మీద వాళ్ళకి ఉన్నంత పట్టు మరే ఇతర నాయకులకి కానీ పార్టీ వాళ్ళకి గానీ లేదు.అత్యధిక మేజారీటితో గెలవాలి అన్నా కడపలో రికార్డు సృష్టించాలి అన్నా సరే వాళ్ళకే చెల్లింది.
గతం ఎంతో అమోఘం మరి ప్రస్తుతం వైఎస్ ఫ్యామిలీ జోరుకు మాత్రం బ్రేకులు పడుతున్నాయి.రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆ కుటుంబంలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతూ వచ్చాయి
వైఎస్ మరణం అనంతరం వైఎస్ భార్య.
వైఎస్ విజయలక్ష్మి రాజకీయాల్లోకి వచ్చారు.రాజశేఖర్‌రెడ్డి మృతి తర్వాత పులివెందుల అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
కాంగ్రెస్ తో తెగ తెంపులు చేసుకున్న జగన్ వేరుకుంపటి పెట్టుకుని వైసీపిని స్థాపించారు.అయితే వరుస విజయాలు వాళ్ళకి ఎలా పలకరించాయో అపజయాలు కూడా అంతకంటే ఎక్కువగానే వెంటపడ్డాయి.2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోయారు.అలాగే వైఎస్ తమ్ముడు.
ఇటీవల ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి చేతిలో ఓటమిపాలయ్యారు
అయితే ఇప్పుడు వైసీపిలో.మరియు వైఎస్ కుటుంభంలో నుంచీ వస్తున్న న్యూస్ ఏమిటి అంటే వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి రాజకీయాల్లోకి రాబోతున్నారు అని.ఆమె ఈ మధ్య వైసీపిలో చాలా కీలకంగా ఉంటున్నారని తెలుస్తోంది.ఇప్పటి వరకూ పారిశ్రామిక వేత్తగా ఎంతో అనుభవం గడించిన ఆమె ప్రస్తుతం.
రాజకీయాల్లో కూడా తన సత్తా చాటడానికి ప్రత్నిస్తున్నారు అని తెలుస్తోంది.పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న సందర్భంలో ఆమెను బుజ్జగించేందుకు…భారతిచేయని ప్రయత్నం అంటూ లేదట.
ఈ విషయాన్ని స్వయానా గిడ్డి మీడియా ముందు తెలిపారు.ఎన్నడు లేని విధంగా జగన్ భార్య భారతి చురుగ్గా రాజకీయా విషయాలలో కల్పించుకోవడం చూస్తుంటే.
ముందు ముందు భారతి వైసీపీలో కీలక నేతగా మారతారనే ప్రచారం సాగుతోంది.







