ఏపీ ప్రభుత్వం నంది అవార్డులని ఏ ముహూర్తాన ప్రకటించిందో తెలియదు కానీ.తెలుగు సినిమా ఇండస్ట్రీ రెండుగా చీలిపోయింది.
అప్పటి వరకూ హుందాగా ఉన్న వాళ్ళు సైతం మీడియా ముందు నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం, ఒకరిని ఒకరు దూషించుకోవడం ఇలా ఒకటి కాదు రెండుకాదు అనేక సంఘటనలు జరిగాయి.నంది అవార్డుల విషయంలో సినీ ప్రముఖుల నుంచి అనేక ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
దర్శకుడు గుణశేఖర్ ఏకంగా ప్రభుత్వాన్ని నిలదీశారు.అంతేకాదు మెగా ఫ్యామిలీకి కూడా నందుల విషయంలో అన్యాయం జరిగింది అంటూ బన్నీ వాసు, నిర్మాత నల్లమలుపు బుజ్జి ఇలా పులువురు ఫైర్ అయ్యారు
అయితే ఈ విషయంలో ఏపీ సీయం చంద్రబాబు ప్రభుత్వం సైతం సీరియస్ అయ్యారు.
హైదరాబాద్ లో ఉంటూ అక్కడ పన్నులు కడుతూ.ఏపీ ఇచ్చే నంది అవార్డుల విషయంలో కామెంట్స్ చేస్తున్నారు.
ఏపీలో ఓటు హక్కు లేని వాళ్ళు సైతం ఏపీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.అదే విధంగా తాజాగా చంద్రబాబు తనయుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలు రకరకాల సందేహాలకు తావిస్తున్నాయి
ఏపీలో ఓటు హక్కు కానీ ఆధార్ కార్డు కానీ లేని వారు సైతం హైదరాబాద్ లో కూర్చుని విమర్శిస్తున్నారని.
అసలు మీరు ఉండేది ఏపీలో కాదు అసలు అవార్డులే ఇవ్వని వారి గురించి ఏమీ మాట్లాడరు…ఏదైనా మీరు తెలంగాణలో మాట్లాడుకోండని షాకింగ్ కామెంట్స్ చేశారు.అంతేకాదు ఒక అడుగు ముందుకు వేసి.
హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడే వారు ఎన్ ఆర్ ఐల తరహాలో నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ (ఎన్ఆర్ఏ) అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే చంద్రబాబు ప్రభుత్వం లోకేష్ చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో తాను తెలంగాణలోనే పుట్టానని బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.మరి తెలంగాణలో నిన్న మొన్నటి వరకూ ఓటు హక్కు కలిగిన నారా లోకేష్ ఇప్పుడు ఏపీ మంత్రి అయినా హైదరాబాద్‌లో ఉన్నవాళ్లు విమర్శలు చేయడానికి అర్హులు కారా అన్న కోణంలో మాట్లాడడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
చంద్రబాబు,లోకేష్ లు సైతం ఏపీ,తెలంగాణా అంటూ విభజించి మాట్లాడటం రాజకీయ విశ్లేషకులని సైతం ఆశ్చర్య పరుస్తోంది.ఎంతో పరిణితి చెందిన రాజకీయ నాయకుడైన చంద్రబాబు వారి ప్రభుత్వం ఎంతో సంయమనంతో ఉండాల్సింది పోయి అక్కడి ప్రభుత్వం, ఇక్కడి ప్రభుత్వం అంటూ ఓటుహక్కు అక్కడ ఉంది.
అయినా సరే అవార్డులు ఇచ్చాం అనడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది
నిజానికి తప్పు జరిగితే అది మన రాష్ట్రం అయినా .వేరే దేశం అయినా సరే ఎత్తి చూపించే హక్కు ఎవరికైనా ఉంది.ఇండస్ట్రీ రెండు రాష్ట్రాల్లోను ఉంది.అంతెందుకు టిడిపి పార్టీ రెండు రాష్ట్రాలలో ఉంది కదా.మరి ఈ లెక్కన రేపు ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తెలంగాణలో టీడీపీకి ఓట్లు అడగరా ?.అసలు విమర్శలు చేయటానికి ఆధార్ కార్డు.ఓటర్ కార్డు కావాలా.టిడిపి అధినేత మరియు కాబోయే అధినేత తమ తమ వ్యాఖలు ద్వారా ఎటువంటి సంకేతాల్ని తెలంగాణా ప్రజలకి టిడిపి నేతలకి పంపుతున్నారు అనేది అర్ధం కావడం లేదు
టీడీపీ భవిష్యత్ నేతగా చెబుతున్న లోకేష్ ఏ మాత్రం ఆలోచించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయటంపై లోకేష్ కి రాజకీయ పరిణితి మీద సందేహం కలుగుతోందని.
ఈ వ్యాఖ్యల ఆధారంగా తెలంగాణలో టిడిపి కి ఓట్లు అవసరం లేదు అనే నిర్ణయానికి చంద్రబాబు లోకేష్ వచ్చారా అనేది చర్చనీయాంశం అయ్యింది.అయినా నారా వారి కుటుంభానికి అక్కడ ఇల్లు లేవా.
ఆస్తులు లేవా.అసలు ఎటువంటి ఉద్దేశంతో ఈ కామెంట్స్ చేశారు అంటూ విశ్లేషకులు ఆశ్చర్య పోతున్నారు.







