మీరు పుట్టిన నెలను బట్టి మీ వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు.జాతకం ఆధారంగా మాత్రం కాదు.
ఒక్కో నెలలో పుట్టిన వారికి ఒక్కో పువ్వులో ఉండే లక్షణాలు ఉంటాయి.మరి మీరు ఏ నెలలో జన్మించారో ఆ నెలకు సంబంధించి ఒక పువ్వు పేరును, ఆ లక్షణాలను తెలుసుకుందాం
జనవరి – కార్నేషన్ ఫ్లవర్
జనవరి నెలలో పుట్టిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.
కార్నేషన్ పువ్వులలో ప్రేమ,అభిమానం ఉంటాయి.అందువల్ల వీరు తోటి వారిని బాగా అర్ధం చేసుకుంటారు
ఫిబ్రవరి – వైలెట్
ఈ నెలలో పుట్టిన వారికీ వైలెట్ పువ్వు లక్షణాలు ఉంటాయి.
ఫిబ్రవరి నెలలో పుట్టినవారు లాజిక్ గా ఆలోచిస్తారు.వీరి వ్యక్తిత్వం విభిన్నంగా ఉండుట వలన ఎప్పుడు బిజీగా ఉన్నామని చెప్పుతూ ఉంటారు
మార్చి – డాఫోడిల్
ఏదైనా కొత్త పనిని ప్రారంభించటానికి ఈ పువ్వు సింబాలిక్ గా ఉంటుంది.
ఈ నెలలో జన్మించినవారికి నైపుణ్యాలు అధికంగా ఉంటాయి.అలాగే ఇతరుల పట్ల ఆత్మీయత చూపిస్తారు.
వీరి మనస్సు సున్నితంగా ఉంటుంది.అలాగే వీరు చేసే పనిలో నమ్మకం ఉండదు
ఏప్రిల్ – స్వీట్ పీ
ఈ పువ్వు ఆనందానికి సూచికగా ఉంటుంది.
ఈ నెలలో పుట్టినవారు చాలా ఆనందంగా ఉంటారు.వీరు పక్క వారితో కూడా చాలా ఆనందంగా గడుపుతారు.
అలాగే ఎక్కువగా ఆశ్చర్యానికి లోను అవుతూ ఉంటారు
మే – లిల్లీ
ఈ పువ్వు మానవత్వం,స్వచ్ఛత కు ప్రతీకగా ఉంటుంది.ఈ నెలలో పుట్టినవారు లిల్లీ పువ్వు వలే చాలా స్వచ్ఛంగా ఉంటారు.
వీరు ఎక్కువగా తమలో తాము చాలా బాధపడుతూ ఉంటారు.వీరు డిప్రెషన్ కు గురి అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి
జూన్ – రోజాపూలు
రోజా పువ్వులు అన్ని కాలాలలోనూ దొరుకుతాయి.
ఈ నెలలో పుట్టినవారు రోజా పువ్వు వలే మంచి రొమాంటిక్ గా ఉంటారు.వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువ.
వీరు అతి సన్నిహితులతోనే ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటారు.
జూలై – ఫాక్స్ గ్లోవ్
ఈ నెలలో పుట్టినవారు చాలా దూకుడుగా ఉంటారు.అయితే వెంటనే మాములు స్థితికి వచ్చేస్తారు
ఆగష్టు – గ్లాడియోల్స్
ఈ పువ్వు గౌరవానికి ప్రతీకగా ఉంటుంది.వీరు చాలా స్వతంత్రంగా ఉండి వారికీ నచ్చిన విషయాలపై ఫోకస్ పెడతారు.
అనుకున్న పని అయ్యేవరకు విశ్రాంతి తీసుకోరు.కొత్త వ్యక్తులతో పరిచయాలు, వారితో స్నేహం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం
సెప్టెంబర్ – అస్టర్
ఈ పువ్వు సహనానికి ప్రతీక.
వీరు జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు.వీరికి చిన్న చిన్న ఆనందాలే సంతృప్తిని ఇస్తాయి.
వీరు కుటుంబాన్ని,స్నేహితులను ఎక్కువగా ప్రేమిస్తారు.వారి కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారు
అక్టోబర్ – బంతిపువ్వు
ఈ నెలలో జన్మించిన వారు బంతి పువ్వు వలే ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు.
వీరు ఎప్పుడు నిరాశకు గురి కారు.అలాగే చుట్టూ ఉన్నవారిని కూడా నిరాశ నుండి బయట పాడేస్తారు.
వీరు కుటుంబానికి ఎక్కువగా అంకితం అవుతారు
నవంబర్ – క్రిసాన్తిమం
ఈ పువ్వు ఆశావాదం, సంతోషానికి ప్రతీక.వీరు ప్రక్రుతిని ప్రేమిస్తారు.
అలాగే వీరిలో సానుభూతి కూడా ఎక్కువగా ఉంటుంది.వీరు ఒత్తిడిలో ఉన్నా సరే పక్కన ఉన్నవారిని సంతోష పెట్టటానికి ప్రయత్నిస్తారు.
వీరు ఎవరిని నొప్పించరు
డిసెంబర్ – పాన్ సెట్టియా
ఈ పువ్వు దూకుడు స్వభావానికి ప్రతీక.మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
అలాగే వీరు వయస్సులో చిన్న అయినప్పటికీ వీరి సూచనలు అమోఘంగా ఉంటాయి.వీరు స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు.