తెలుగుదేశం తెలంగాణలో ఒక చరిత్ర కాబోతోందా.పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారనుందా.?అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఎంతో మందికి భవిష్యత్తుని ఇచ్చిన పార్టీ తెలుగు దేశం పార్టీ అంతెందుకు ఇప్పుడు తెలంగాణా లో చక్రం తిప్పుతున్న కేసీఆర్ కూడా తెలుగుదేశం లో కీలక భాద్యతలు చేపట్టారు.
రాజకీయం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అందుకే సీన్స్ అన్నీ ఒక్కొక్కటిగా రివర్స్ అవుతున్నాయి
ఒకరిద్దరు వెళిపోతే తమకు నష్టం లేదు .రేవంత్ వెళితే పార్టీకి ఏమి కాదు అంటూ ప్రకటించిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యలు.ఇప్పుడు చెల్లుబాటు కావడం లేదు ఆ విషయం ఆయనకు కూడా తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి.ఒక్కొరొక్కరుగా కాదు.ఇటీవలి పరిణామాలను చూస్తే.
గుంపులు గుంపులుగా అందరు కారేక్కేస్తున్నారు.లేదా కాంగ్రెస్ కండువా కప్పేస్తున్నారు.
రేవంత్ కాంగ్రెస్ కి వెళ్తే.మిగిలిన వాళ్ళు టీఆర్ఎస్ వైపు వెళ్తున్నారు…ఇప్పుడు జిల్లాల వారిగా తెలంగాణలో టిడిపిని ఖాళీ చేస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకప్పుడు టీడీపీకి మంచి పట్టుంది.
కానీ నేతలు అందరు పక్క పార్టీల వైపు చూడటంతో జిల్లాలో పార్టీ బలహీనమైంది.ఎప్పుడైతే రేవంత్ పార్టీ వీడాడో అప్పటి వరకు టిడిపిని నడిపించిన బడా లీడర్స్ అయిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు అరికెల నర్సారెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి.
రాజారాం యాదవ్ కాంగ్రెస్ గూటికి చేరటంతో ప్రస్తుతం జిల్లాలో టిడిపి ఖాళీ అనే చెప్పాలి.కామారెడ్డి జిల్లా పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది టీడీపీ అధ్యక్షుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేశారు.
ఇప్పుడు అక్కడ పార్టీని నడిపించే నాయకుడు లేక ఏమి చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో ఉంది టిడిపి పరిస్థితి.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టీడీపీని నడిపించే నాయకులు అసలు మచ్చుకు కూడా కనపడటం లేదు.
టిడిపికి పెద్ద దిక్కుగా ఉన్న నేతలు అందరు సైకిల్ ఎక్కేస్తుంటే.అనుచరులు కార్యకర్తలు కూడా వారి వెంట వెళ్ళిపోతున్నారు
జిల్లాలో ప్రస్తుతానికి ఇద్దరు సీనియర్ నేతలు మండవ వెంకటేశ్వరరావు, అన్నపూర్ణమ్మ మాత్రమే టీడీపీలో ఉంటున్నట్టుగా ఉన్నారు కానీ పార్టీకి దూరంగా ఉంటున్నారు
పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆ ఇద్దరు నేతలు కూడా వారి స్థాయికి తగ్గట్టుగా పని చేయట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
మండవతో పాటు అన్నపూర్ణమ్మకి ఉమ్మడి జిల్లాలో పార్టీపై గట్టి పట్టుంది.ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు కూడా సైకిల్ వదిలి కారు ఎక్కడానికి సిద్దంగా ఉన్నారు అని తెలుస్తోంది.
ఇదే కనుక జరిగితే టిడిపి పార్టీ తెలంగాణలో కనుమరుగు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.







