తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాకా కేసీఆర్ మొట్టమొదటు సిఎం అయ్యారు.ఇది తెలంగాణా చరిత్రలో నిలిచిపోయే అంశం.
అయితే అధికారంలోకి రాగానే బంగారు తెలంగాణా చేస్తాను అని ప్రకటించిన కేసీఆర్ ఆదిశగా అడుగులు వేస్తున్నారు.ప్రతిపక్షాలు చేసే మాటల దాడులు సైతం తిప్పి కొట్టగలిగే టాలెంట్ కేసీఆర్ సొంతం.
అందుకే రేవంత్ ని తమ పార్టీలోకి ఆహ్వానించి మరీ కేసీఆర్ కి చెక్ పెట్టాలని చూస్తున్నారు.అయినా కేసీఆర్ ఎక్కడా వెనకడుగు వేయలేదు.
కానీ ఇప్పుడు కేసీఆర్ కి సొంత జిల్లా నుంచీ కష్టాలు మొదలయ్యాయి
కేసీఆర్ ని సొంత జిల్లాలో ప్రజలే వ్యతిరేకిస్తున్నారు ఈ పరిస్థితికి రావడానికి కారణం నీటి వివాదం.నిన్న మొన్నటి వరకు నీటి కోసం కొట్టుకున్న రెండు రాష్ట్రాల పరిస్థితి చూసే ఉంటారు.
కానీ అదే నీటికోసం కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వాళ్ళ ఆయన సొంత జిల్లా మెదక్ రైతులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
సింగూరు జలాలను శ్రీరాం సాగర్ కు ప్రభుత్వం తరలించడాన్ని మెదక్ జిల్లావాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లాకు మంజీరా నది నుంచే నీటి లభ్యత ఉంది.
మంజీరా నదిపై పుల్కల్ మండలం వద్ద సింగూరు జలాశయాన్ని నిర్మించారు
సింగూరు జలాశయం సామర్థ్యం 30 టీఎంసీలు.ప్రాజెక్టు నిర్మించి మూడు దశాబ్దాలవుతున్నా తొలిసారి గత ఏడాది ప్రభుత్వం ఈ జిల్లాలో సాగునీటిని విడుదల చేసింది.30 వేలకు పైగా ఎకరాల్లో రెండో పంటకు నీరందించడంతో రైతులు ఆనందం కూడా వ్యక్తం చేశారు.ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రైతులు ఆందోళనకి లోనవుతున్నారు.
గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు సింగూరు జలాశయం కళకళలాడింది.దీంతో రబీలో రైతాంగానికి నీటిని ప్రభుత్వం విడుదల చేసింది.
ఇప్పుడు ఉన్న నీటిలో 15 టీఎంసీలను శ్రీరాం సాగర్ జలాశయానికి విడుదల చేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.సింగూరు నుంచి రెండు గేట్లు ఎత్తి శ్రీరాంసాగర్ కు నీటిని విడుదల చేశారు అధికారులు.
మొత్తం పదిహేను టీఎంసీల నీటి నిల్వ ఉంటే దానిలో వీటిలో మూడు టీఎంసీలు ఘనాపూర్ ఆయకట్టుకు.ఐదు టీఎంసీలు వాటర్ గ్రిడ్.
ఐదు టీఎంసీలు డెడ్ స్టోరేజీ.ఇక రెండు టీఎంసీల నిల్వ మిగిలితే మేము ఏమి చేయాలి అంటూ మెదక్ రైతులు చెప్తున్నారు
మా అవసరాలని తీర్చకుండా పక్క జిల్లాలకి నీటిని తరలిస్తే ఎలా అంటూ మెదక్ జిల్లా రైతులు అందోళన చేస్తున్నారు.
అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఇప్పుడు 53 టీఎంసీల నీటి నిల్వ ఉంది.అక్కడ ప్రజల కోసం మాత్రం ప్రభుత్వం విడుదల చేయకుండా ఎస్సార్ఎస్పీ నుంచి కాళేశ్వరానికి ట్రయల్ రన్ వేయడానికే ఈ నీటిని విడుదల చేయడం ఎంతవరకు న్యాయం అంటున్నారు.
దాంతో కేసీఆర్ నిర్ణయాలకి వ్యతిరేకంగా మెదక్ లో నిరసనలు మొదలయ్యాయి.







