చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్న కృష్ణా టిడిపి లొల్లి

కృష్ణ జిల్లా అంటేనే టిడిపికి కంచుకోట.పశ్చిమగోదావరి జిల్లా లో టిడిపి ప్రభావితం ఎలా ఉంటుందో అంతకంటే ఎక్కువగా కృష్ణా జిల్లా లో టిడిపి హవా నడుస్తుంది.

 Chandrababu Waiting For Central Response-TeluguStop.com

అయితే మారుతున్న రాజకీయపరినామాలు మరియు మాలీ తెరపైకి వస్తున్నా పునర్విభజన అంశం ఇప్పుడు టిడిపి కృష్ణా లో కాక పుట్టిస్తున్నాయి.ఈ పరిణామాలతో ఒకవైపు టీడీపీ నేత‌ల‌తో పాటు మరోవైపు వైసీపీ నుంచి వ‌చ్చిన జంపింగ్లు కూడా గంపెడు ఆసెలు పెట్టుకుంటున్నారు.

మ‌రోప‌క్క మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ నేత‌లు కూడా త‌మ‌కు ఎన్నో కొన్ని సీట్లు కోరే అవ‌కాశాలు లేక‌పోలేదు.మోడీ ప్రభుత్వం ఒకవేళ ఈ విషయంలో పునర్విభజన విషయంలో సానుకూలంగా ఉంటే మాత్రం టిడిపి అధ్యక్షుడికి అంతకంటే పెద్ద తలనెప్పి వ్యవహారం మరొకటి లేదు.

ఇప్పటి పరిస్థితి కూడా అలానే ఉంది

కేంద్రం నియోజకవర్గ పునర్విభజనపై సానుకూలంగా ఉన్నట్టు వస్తున్న వార్తలు ఆశావాహులకి ఎంతో బలాన్ని ఇస్తున్నాయి…నెలాఖరులో కేంద్ర క్యాబినెట్‌ ఈ పెంపుకు ఆమోద ముద్ర వేయనుందని చెబుతున్నారు.కేంద్రం ఇదే కనుక చేస్తే టీడీపీ మాత్రం గెలుపు గట్టు ఎక్కేసినట్టే అంటున్నారు నేతలు.

అయితే ప్ర‌స్తుతం కృష్ణా జిల్లాలో 16 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.పునర్విభజన జరిగితే మరో నాలుగు పెరుగుతాయి.

విశ్లేషకుల‌ అంచనా ప్రకారం విజయవాడలో మరో నియోజకవర్గం ఏర్పడుతుంది.నందిగామ, జగ్గయ్యపేట , మైలవరం, నియోజకవర్గాల్లో కొన్ని మార్పులు చేసి కంచికచర్ల లేదా ఇబ్రహీంపట్నం కేంద్రంగా మరో కొత్త అసెంబ్లీ సెగ్మెంట్‌గా మరే చాన్స్ ఉందని టాక్.

అవనిగడ్డ ని కూడా విభజించి రెండు నియోజకవర్గాలుగా చేసే అవకాసం ఉందట

గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీతో ఉన్న పొత్తు కారణంగా ఆ పార్టీకి కైకలూరు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించింది.మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు అవినాష్‌, కడియాల బుచ్చిబాబు కూడా టిడిపి లోకి వచ్చేశారు.

దేవినేని నెహ్రూ మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అవినాష్‌కు సీటు లభిస్తుందని నెహ్రూ వర్గీయులు ఆశతో ఉన్నారు.

జలీల్‌ఖాన్‌ తనకు బదులు కుమార్తె ఖాటూన్‌ను బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నారు.పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ సీనియర్లయిన నాగుల్‌మీరాతో పాటు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా అవకాశం ఇస్తే అసెంబ్లీ బరిలోకి దిగాలనే తలంపుతో ఉన్నారు

సెంట్రల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు మళ్ళీ అవకాసం లభిస్తుంది చంద్రబాబు ఆశీస్సులు మెండుగా ఉన్నాయి అని తెలుస్తోంది.

అయితే ఈ సారి బ్రాహ్మణులకి కూడా అవకాశం కలిపిస్తే.కేవలం బ్రాహ్మణుల ఓట్లు అక్కడ ఒక్కచోటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గెలుచుకోవచ్చు అనే ఆశలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

అందుకోసమే.సెంట్రల్‌ నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఏకైక నాయకుడుగా ఉన్న ప్రముఖ ఆడిటర్‌ ముష్ఠి శ్రీనివాస్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నె వెంకట నారాయణ ప్రసాద్‌కు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు సీఎం దృష్టిలో ఉన్నారు కాబట్టి ఆయన సీటుకి డోకా లేదు.

కాంగ్రెస్‌ నుంచి వ‌చ్చిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, మాజీ డిప్యూటీ స్పీకర్‌ బూరగడ్డ వేదవ్యాస్‌, ఆప్‌కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, కొనకళ్ల బుల్లయ్య, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌, గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌, పిన్నమనేని బాబ్జి.ఇలా లిస్టు చెప్పుకుంటూ పొతే ఆశావాహులకి కొరతలేదు.

అయితే పార్టీలోకి చంద్రబాబు అందరిని ఆహ్వానిస్తున్నారు.ఒకపక్క టిడిపి లో గత ఎన్నికల్లో అవకాసం రాని వాళ్ళు మరియు ఇప్పుడు రేసులో ఉన్నవాళ్ళు మరోపక్క.

వైసీపి వలసలు.ఇటు మిత్రపక్షం.

బిజేపి.ఇవన్నీ పక్కన పెడితే జనసేన టిడిపితో జట్టు కట్టితే వారికి ఇచ్చే సీట్లు ఇలా చంద్రబాబు కేంద్రం ఇచ్చే సీట్ల విషయంలో గంపెడు ఆశలతో ఉన్నారు ఒకవేళ కేంద్రం మొండిచేయి చూపిస్తే అది టిడిపిపై తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాసం కూడా లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube