ప్రజారాజ్యం పవన్ కళ్యాణ్ కి ఇప్పటి జనసేన పవన్ కళ్యాణ్ కి తేడా ఉంది.ప్రజారాజ్యం లో ఉన్నప్పుడు.
చాలా దురుసుగా ఉంటూ.నోటికి ఎదోస్తే అది మాట్లాడేసే పవన్.
ఇప్పుడు ఒక పార్టీ అధినేతగా ఉండటం వలన ఆచితూచి మాట్లాడటం చేస్తున్నారు.అంతేకాదు ఫ్యాన్స్ కూడా సంయమనం కోల్పోవద్దు అంటూ హితవు పలుకుతున్నారు.
అయితే పార్టీ నిర్మాణం చాలా వేగంగా అంతర్గతంగా సాగుతోంది అని చెప్తున్నా.అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు.
పైకి ఎన్ని కబుర్లు చెప్తున్నా లోపల ఎదో జరిగిపోతోంది అన్నటుగా సాగే పవన్ సన్నిహితుల మాటలు వాస్తవానికి దగ్గరగా లేవు
విజయవాడలో జనసేన పార్టీ ఉపాద్యక్షుడు మహేంద్రరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనూ 2018 మార్చిలో పెద్ద మార్పు రానున్నట్లుగా చెప్పారు.త్వరలోనే పాదయాత్ర రూపంలో పవన్ ప్రజల మధ్యకి రానున్నారు అని చెప్పారు.
పనిలో పని జనసేన పార్టీ ఎటువంటి వారికి టికెట్స్ ఇవ్వబోతోంది కూడా వెల్లడించారు.ఈ విషయంలో యువత.
పవన్ అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు
జనసేన పార్టీ మీడియా సలహాదారు హరిప్రసాద్ ఒక కీలక ప్రకటన విడుదల చేశారు.రాబోయే ఎన్నికల్లో సుమారు 60 నుంచి 65 శాతం వరకు కొత్తవారికే టికెట్లు ఇవ్వనున్నట్లు పవన్ కల్యాణ్ తమకు చెప్పినట్లుగా ఆయన వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే…జనసేన పార్టీ తెలుగుదేశం తో పనిచేస్తుందా లేక వైఎస్ఆర్ పార్టీతో కలిసి నడుస్తుందా అనేది అప్పుడే చెప్పలేము అంటున్నారు జనసేన పార్టీ వర్గాలు.