చంద్రబాబు కి తలనొప్పి తెప్పిస్తున్న బామ్మర్ది

మళ్ళీ సీన్ రిపీట్.బామ్మర్ది అస్సలు మారడు.

ఒక పక్క చంద్రబాబు ప్రతిపక్షాలు చేసే దాడులు ఎదుర్కొంటూ.

అందరికి సమాధానాలు చెప్తూ.

పాలనా పరంగా ఎన్నో సమస్యలు చుట్టూ ముడుతున్నా సరే సమర్ధవంతంగా తన అనుభవంతో అన్నిటినీ సింగల్ హాండ్ పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు ఒక్క బామ్మర్ది విషయంలో తల పట్టుకున్తున్నాడు.హిందూపురం ఎమ్యెల్యే బాలకృష్ణ చంద్రబాబు కు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టడం టిడిపి వర్గాల్లో అసహనం పెంచుతుంది.

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా హిందూపురంలో బాలయ్య మరో అభిమాని చెంప చెళ్లుమనిపించడం తో ఆదెబ్బ టిడిపికి మరోసారి తగిలింది.బాలకృష్ణ ఎవరో ఒకరిని కొడుతున్న ప్రతీసారి ఆ దెబ్బ టిడీపి పరువుమీద పడుతోంది అని ఆలోచించడం లేదు బాలయ్య.

Advertisement

నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కాల్పుల ఘటన , ఆ తరువాత బాలయ్య కు మానసిక పరిస్థితి బాలేదని సాక్ష్యాలతో కేసు నుంచి ఆయన గట్టెక్కిన తరువాత ఎన్ బి కె కొంత కాలం సైలెంట్ గా వున్నా ఆ తరువాత ఇటీవల వైలెంట్ అయిపోతున్నారు.బాలయ్య ఎప్పుడు తప్పు చేస్తూ దొరికుతాడా అని కాచుకుని కూర్చున్న సోషల్ మీడియా .బాలయ్య చెంప దెబ్బ పడటం ఆలస్యం ఆ వీడియోలు వైరల్ అయిపోతున్నాయి.బాలయ్యతో ఈ సమస్య పొతే పరవాలేదు.

కానీ చంద్రబాబు ని కూడా లాగేసి మరీ సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు.ఆ మధ్య పైసా వసూల్ ఆడియో కార్యక్రమం ఖమ్మం లో జరిగినప్పుడు దర్శకుడు పూరి జగన్నాధ్, బాలయ్య అభిమానులపై చెయ్యి చేసుకోవడాన్ని సమర్ధించారు.

బాలయ్య బాబుకి మిగిలిన హీరోల్లా బౌన్సర్లు అవసరం లేదన్నారు.ఆయనే ఎవరైనా మీద పడకుండా చూసుకోగలరని ఛలోక్తులు విసిరారు.

ఇది ఇలా ఉంటే ఎన్నికలు సమయం ఒక పక్క ముంచుకుని వస్తుంటే బాలయ్య ఇలా చేయడంతో తెలుగుదేశం నాయకులు తెగ ఇబ్బందులు పడుతున్నారు.ఏది ఏమైనా చంద్రబాబు ఈ విషయంలో బాలయ్యతో మాట్లాడితేనే గానీ మునుముందు సమస్యలు రాకుండా ఉంటాయని టిడీపి నాయకుల వాదన.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

బామ్మర్ధితో లాభామేమో గానీ పార్టీకి అంతకంటే ఎక్కువ నష్టం వచ్చేలా ఉంది తమ్ముళ్ళ వాదన.

Advertisement

తాజా వార్తలు