కేసీఆర్ కి బెజవాడ దుర్గగుడిలోకి నో ఎంట్రీ..కారణం ఇదే

బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ఎదురు చేస్తున్న కేసీఆర్ ఆశలు తీరేలా లేవు.కేసీఆర్ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో బెజవాడ దుర్గమ్మని దర్శించుకోవాలని అనుకున్నారు కానీ ఎక్కడ ఏమి జరిగిందో ఆయన పర్యటన ఆగిపోయింది.

 Vijayawada Durga Temple Authority Rejected Kcr Trip-TeluguStop.com

కేసీఆర్ అడిగిన రెండు తేదీలలో మేము ఆయనకి దర్శనం ఏర్పాట్లు చేయలేము అని చేతులు ఎత్తేశారు దుర్గగుడి అధికారులు.

అమ్మవారి జన్మనక్షత్రం అయిన మూలా నక్షత్రం చాలా చాలా మంచి రోజు.

ఆరోజు అమ్మవారిని దర్శించుకుంటే కష్టాలు అన్నీ పోతాయి అని భక్తుల భావన.అదేవిధంగా కేసీఆర్ కూడా ఇదే మూల నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవాలని అనుకున్నారు.

అదే రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సైతం రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉండటంతో ఏపీ సీఎం కార్యాలయానికి సమాచారం అందించారు.కేసీఆర్ మూల నక్షత్రం రోజు…లేకుంటే విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకుంటారని తెలంగాణ సీఎం కార్యాలయం నుంచి అందిన సమాచారాన్ని అందించారు.

ఆ తరువాత పరిణామాలు ఏమి జరిగాయో గానీ కేసీఆర్ పర్యటన రద్దు అయ్యింది.కేసేఆర్ వచ్చేరోజున వచ్చే లక్షలాది మంది భక్తులని నియంత్రిచడం మా వాళ్ళ కాదని.

కేసీఆర్ అదే సమయంలో వస్తే మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి అని.భక్తులు కూడా చాలా ఇబ్బంది పాడుతారని చెప్పారు.అదీ కాక అదే రోజున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున చంద్ర బాబు నాయుడు పట్టు వస్త్రాలు సతీ సమేతంగా సమర్పించారు.అయితే సాక్షాత్తు ఒక సీఎం వస్తున్నా ఏర్పాట్లని చేయలేరా అని అనుకుంటున్నారట.

కానీ అసలు కారణం మాత్రం ఇది కాదని రాష్ట్రం విడిపోతే బెజవాడ అమ్మవారికి కానుకలు ఇస్తాను అని కేసీఆర్ అనుకున్నాడట అందుకే ఆయన దుర్గ గుడికి రాకుండా చేశారు అని అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube