“బిచ్చగాడిగా” అర్జున్ రెడ్డి ?

గత కొన్ని వారాలు టాలీవుడ్ అంతా విజయ దేవరకొండ గురించే చర్చ.అదేనండి అర్జున్ రెడ్డి మీదే చర్చ జరిగింది.

 Vijay Devarakonda In Kannada Bichhagaadu Movie-TeluguStop.com

టాప్ హీరోలు ,హీరోయిన్స్ సైతం అర్జున్ రెడ్డి సూపర్ మూవీ అని ట్వీట్స్ చేయడం తో ఈ పెళ్ళిచూపుల కుర్రాడు ఫుల్ పాపులర్ అయ్యాడు.ఎంత పాపులర్ అయ్యాడు అంటే యువతలో మనోడి మీద క్రేజ్ పెరిగిపోయి మనోడి హెయిర్ స్టైల్ ని ఫాలో అయిపోయేలా

ప్రస్తుతానికి అర్జున్ రెడ్డి అరడజను సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు.

ఈ సినిమాలు అన్నీ చేసే సరికి సుమారు రెండేళ్ళు పడుతుందట.ఇది ఇలా ఉంటే విజయ్ పొరుగు భాషల సినిమాల మీద దృష్టి పెట్టాడట.

కన్నడంలో ఒక సినిమా చేయాలని అనుకున్నట్టు.అనుకున్నదే తడవుగా ఆల్రెడీ అటు తమిళ్ ఇటు తెలుగు లో సూపర్ హిట్ అయిన ఒక సినిమా ని కన్నడం లో విజయ తో తీయడానికి అక్కడి నిర్మాత సిద్దమైనట్టు తెలుస్తోంది

తమిళ్ లో భారి హిట్ అయ్యి అదే సినిమా తెలుగులో కూడా సూపర్ డూపర్ హిట్ అయిన బిచ్చగాడు మూవీ ఎంత ఇమేజ్ ని సంపాదించుకున్నది అందరికీ తెలిసినదే ఇప్పుడు అదే సినిమాని అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండతో కన్నడం లో తీయడానికి ఒక కన్నడ నిర్మాత ఆశక్తి చుపుతున్నాడట.

పుట్టపర్తిలో చదువుకోవడం వల్ల విజయ్ కి కన్నడ మీద మంచి పట్టే ఉంది.ఈ నేపథ్యంలో నేరుగా కన్నడ సినిమా చేయాలని చూస్తున్నాడట విజయ్.

కన్నడం లో డబ్బింగ్ సినిమాలకి నో ఎంట్రీ.మరి అక్కడ డైరెక్ట్ గా ఇలా ఎన్ని సినిమాలని తీయగలడు తమిళ్ ,మలయాళం లో ఐతే తెలుగులో తీసే సినిమాలు డబ్బ్ చేసుకోవచ్చు అని అంటున్నారట.

తెలుగులో ఇన్ని సినిమా లు ఒప్పుకున్న విజయ్ కన్నడం లో రెగ్యులర్ గ ఎలా చేయగలడు అని ప్రశ్నిస్తున్నారు సినీ అభిమానులు.మరి విజయ్ ఆలోచన ఎలా ఉందో.

తన కెరియర్ ని ఎలా మలుచుకుంటాడో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube