ఓ రైటర్ స్టోరి దొంగలించిన తేజ?

మొదటిరోజు డివైడ్ టాక్ తో మొదలైనా, మిగితా రెండు సినిమాలు ప్రేక్షకులని అంతలా ఆకట్టుకొకపోవడం వలనో లేక సినిమాలో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులకి నచ్చడం వలనో, నేనే రాజు నేనే మంత్రి మంచి వసూళ్లను రాబట్టుకుంది.మిగితా రెండు సినిమాలు లై, జయ జానకి నాయకలను చాలా పెద్ద తేడాతో వెనక్కితోసింది.

 Teja Steals Nene Raju Nene Mantri Story From Other Writer ?-TeluguStop.com

డీసెంట్ టాక్ తో దూసుకుపోతున్న నేనే రాజు నేనే మంత్రి తేజ సొంత కథ కాదా? ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారమైతే ఇది తేజ సొంత కథ కాదు అంట.దీన్ని తేజ ఓ రైటర్ నుంచి దొంగాలించారని, అతని పేరు కూడా వేయకుండా మోసం చేసారని టాక్ వినిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే తిమ్మరెడ్డి అనే రచయిత ఒకప్పుడు దర్శకుడు ఎన్.శంకర్ దగ్గర అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేసేవాడు.అతను తాను రాసుకున్న పొలిటికల్ డ్రామాను తేజకి వినిపించడం, ఆ స్టోరి లైన్ తేజకి బాగా నచ్చడం, రెండు చకచక జరిగిపోయాయి.ఆ తరువాత ఇద్దరు ఆరునెలల పాటు ఆ కథ మీద పనిచేసారట.

ఆ కథ ఓ షేపులోకి వచ్చాక, ఈ సినిమా ఎవరితో తీసినా, టైటిల్స్ లో తన పేరు వేస్తానని, అలాగే మంచి ఎమౌంట్ కూడా ఇప్పిస్తానని తేజ ప్రామిస్ చేసారట.

కాని ఆ తరువాత మాట మీద నిలబడని తేజ, నేనే రాజు నేనే మంత్రి తన సొంత కథలా ప్రచారం చేసుకున్నారని, సురేష్ ప్రొడక్షన్స్ వారికి కూడా అలానే చెప్పారని, కథకి అసలు రచయిత అయిన తిమ్మారెడ్డిని పూర్తిగా సైడ్ చేసారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరి ఇందులో నిజమెంతో, అబద్ధమెంతో.ఈ వివాదంపై తేజ స్వయంగా స్పందిస్తేనే బాగుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube