మెగాస్టార్ చిరంజీవితో మొదలైంది టాలివుడ్ లో డ్యాన్స్ లపై క్రేజు.అప్పట్లో తెలుగు వారికి తెలిసినంతవరకు మైకేల్ జాక్సన్ ఆయనే.
ఆ తరువాత మెగాస్టార్ ని స్ఫూర్తి తీసుకొని హీరోలంతా డ్యాన్స్ బాగా వేయడం మొదలుపెట్టారు.ఇప్పుడు స్టార్ హీరోలు, కుర్ర హీరోల్లో ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది మంచి డ్యాన్సర్లు ఉన్నారు.
కాని ఎంతైనా స్టార్ హీరోలకి మనం ఇచ్చే అటెన్షన్ వేరు కదా.ఇక స్టార్ హీరోల్లో డ్యాన్సర్లు అనగానే మనకు ఎన్టీఆర్, అల్లు అర్జున్ చరణ్ పేర్లు గుర్తుకువస్తాయి.ప్రభాస్ పర్వాలేదు అనుకోండి.ఇక డ్యాన్స్ విషయంలో అగ్రహీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.మరి ఎన్టీఆర్, అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ లో ఎవరు బాగా డ్యాన్స్ చేస్తారు ? ఈ ముగ్గురిలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు ?
ఇతడే బెస్ట్ డ్యాన్సర్ అని చెప్పడానికి ఎలాంటి కొలతలు లేవు కదా.పంది మందిని అడిగితే కొందరు ఎన్టీఆర్ అని అంటారు, కొందరు బన్నికి ఓటు వేస్తారు, మరికొంతమంది చరణ్ కే ఆ బిరుదు కట్టబెట్టేస్తారు.ఎవరి అభిప్రాయాలు వారివి.కాని ఒక సెలబ్రిటి పైనా మరో సెలబ్రిటి ఇచ్చే అభిప్రాయానికి ఎక్కువ విలువ ఉంటుంది.ఓసారి మహేష్ ని అడిగితే ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అన్నాడు.ఓసారి పవన్ ని అడిగితే, పవర్ స్టార్ కూడా ఎన్టీఆర్ కే ఓటు గుద్దాడు.
ఇప్పుడు రకుల్ ప్రీత్ కూడా అదే మాట చెబుతోంది.ఆ ముగ్గురిలో ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అంటోంది.
తన అభిప్రాయం వెనుక ఉన్న బలమైన కారణం కూడా చెప్పింది.
ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో, బన్నితో సరైనోడు, చరణ్ తో బ్రూస్ లీ చేసింది రకుల్.
కాబట్టి ముగ్గురు సెట్స్ మీద ఎలా ఉంటారో, ఎలా డ్యాన్స్ చేస్తారు రకుల్ కి బాగా తెలుసు.ఎన్టీఆర్ పెద్దగా ప్రాక్టిస్ చేయకుండానే స్టెప్స్ వేస్తాడట.
డ్యాన్స్ మాస్టర్ ఇలా చెప్పగానే అలా స్టెప్ పట్టేసి, పెద్దగా టెక్స్ తీసుకోకుండా పర్ఫెక్ట్ గా స్టెప్స్ వేయడం ఎన్టీఆర్ స్పెషాలిటి అంట.బన్ని అండ్ చరణ్ కూడా అధ్బుత డ్యాన్సర్లు అయినా, వారు రిహార్సల్స్ బాగా చేస్తారట.కాబట్టి ఈ ముగ్గురిలో ఎన్టీఆర్ బెస్ట్ డ్యాన్సర్ అని ఫిక్స్ చేసేసింది.