అత్యంత అందమైన టాప్ 10 మహిళా క్రికెటర్లు వీరే

మహిళా ప్రపంచకప్ ముగిసింది.ఎన్నడు లేనిది, జనాలు మహిళా క్రికెట్ ని టీవిలకు అతుక్కుపోయి చూసారు.

 Top 10 Most Beautiful Cricketers In The World-TeluguStop.com

దురదృష్టం కొద్ది మన భారత జట్టు ఫైనల్ లో ఓడిపోయినా, వంద కోట్ల మనసులు గెలుచుకున్నారు.మరి ఇటు ఆటతో పాటు, తమ అందంతో కుర్రాళ్ళ మనసుల్ని గెలుచుకుంటున్న టాప్ 10 క్రికెట్ అందగత్తెలు ఎవరో చూస్తారా ?

10.Nuzhat Parween :

Top 10 most beautiful cricketers in the world Telugu Viral News Top 10 Most Beau

కొత్తగా భారత జట్టులోకి వచ్చింది.గత ఏడాది టీ20లలో డెబ్యూ చేసిన ఈ 21 ఏళ్ల అమ్మాయి, ఈ ఏడాది మేలో వన్డే టీమ్ లో చోటు దక్కించుకుంది.కాని పాపం, ప్రపంచ కప్ కు సెలెక్ట్ అయినా, ఒక్క మ్యాచు కూడా ఆడే అవకాశం రాలేదు.కారణం, జట్టులో సుష్మ వర్మ రూపంలో ఓ సీనియర్ వికెట్ కీపర్ ఉండటం.

9.Mithali Raj :

Top 10 most beautiful cricketers in the world Telugu Viral News Top 10 Most Beau

మన హైదరాబాద్ అమ్మాయి.వుమెన్ క్రికెట్ దిగ్గజం.మహిళల క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత ఈ ప్రపంచకప్ లోనే సొంతం చేసుకుంది మన భారతీయ మహిళా జట్టు సారధి.1999లో సంవత్సరంలో జట్టులోకి వచ్చిన మిథాలి, 2005 మరియు 2017 ప్రపంచకప్ లో జట్టుని ఫైనల్ దాకా తీసుకెళ్ళింది.

8.Sana Mir :

Top 10 most beautiful cricketers in the world Telugu Viral News Top 10 Most Beau

31 ఏళ్ల ఈ పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం 2005లో జట్టులోకి వచ్చింది.మంచి ఆల్ రౌండర్ అయిన సనా మీర్ కుడి చేతితో బ్యాటింగ్ చేస్తుంది, కుడి చేతితో ఆఫ్ స్పిన్ వేస్తుంది.2010 మరియు 2014 సంవత్సరాల్లో జరిగిన ఆసియా గేమ్స్ లో పాకిస్తాన్ రెండుసార్లు గోల్డ్ మెడల్ సాధిస్తే, ఆ రెండు సార్లు జట్టుకి నాయకత్వం వహించింది సనానే.ఈ ప్రపంచకప్ కూడా సనా సారథ్యంలోనే ఆడింది పాకిస్తాన్ జట్టు.

7.Meg Lanning :

Top 10 most beautiful cricketers in the world Telugu Viral News Top 10 Most Beauఆస్ట్రేలియా జట్టు కెప్టెన్.ఈవిడని మెగాస్టార్ మెగ్ లానింగ్ అని అంటారు.మరి ఆట అలా ఉంటుంది.

మహిళ క్రికెట్ లో విరాట్ కోహ్లీ మాదిరి అన్నమాట.అన్ని రికార్డులు బుట్టలో వేసుకుంటోంది.ఇప్పటికే తనని ఓ దిగ్గజం అని అంటున్నారు.

6.Danielle Wyatt :

Top 10 most beautiful cricketers in the world Telugu Viral News Top 10 Most Beau

ఇంగ్లాడ్ స్టార్.కోహ్లీకి వీరాభిమాని.ఓసారి కోహ్లీ నన్ను పెళ్ళి చేసుకో అంటూ ప్రపోజ్ చేసింది.కోహ్లీకి మంచి ఫ్రెండ్.కాని ఇద్దరి మధ్య మీరకునే రిలేషన్ షిప్ మాత్రం లేదు.

5.Dane van Niekerk:

Top 10 most beautiful cricketers in the world Telugu Viral News Top 10 Most Beau

దక్షిణాఫ్రికా కెప్టెన్.మంచి లెగ్ స్పిన్ బౌలర్.ఈ ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా సెమిస్ దాకా వచ్చింది అంటే, దాని వెనుక డెన్ కృషి, కష్టం చాలా ఉంది.బ్యాటింగ్ కూడా బాగా చేస్తుంది.

4.Holly Ferling :

Top 10 most beautiful cricketers in the world Telugu Viral News Top 10 Most Beauఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్.2013వ సంవత్సరంలో జట్టులోకి వచ్చినా, ఎందుకో అనుకున్నరీతిలో క్లిక్ అవ్వలేదు.కాని తన అందానికి మాత్రం ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్ ఉన్నారు.

3.Sarah Taylor :

Top 10 most beautiful cricketers in the world Telugu Viral News Top 10 Most Beau100 కి పైగా మ్యాచులు, 40కి యావరేజ్ .తన దశాబ్ద కాలంలో ఇంగ్లాడ్ కి ఎన్నో విజయాలను అందించింది సారా టైలర్.ఈ ప్రపంచకప్ లో కూడా దుమ్ముదులిపింది.

నిన్న ఫైనల్ లో కూడా రాణించింది.ఇంగ్లాండ్ వికెట్ కీపర్ గా ఈమె స్థానానికి ఇప్పట్లో డోకా లేదు.

2.Smiriti Mandhana :

Top 10 most beautiful cricketers in the world Telugu Viral News Top 10 Most Beauపరిచయం అక్కరలేని పేరు కదా ఈ 21 ఏళ్ల అమ్మాయిది ? ఈ ప్రపంచకప్ తోలి రెండు మ్యాచుల్లో ఒకదాంట్లో 90+ మరో దాంట్లో సెంచరీ చేసి, ఒక్కసారిగా స్టార్ గా ఎదిగినా మందాన, ఆ తరువాత వరుసగా విఫలమయ్యింది.అయితే ఏం, టాలెంట్ ఉన్న క్రికెటర్.మహిళల బిబిఎల్ కాంట్రాక్ దక్కించుకుంది ఇద్దరు భారతీయ మహిళలే.అందులో మందాన ఒకరు, మరొకరు హర్మన్ ప్రీత్ కౌర్.

1.Ellyse Perry :

Top 10 most beautiful cricketers in the world Telugu Viral News Top 10 Most Beau

మహిళల క్రికెట్ లో అత్యధిక అభిమానులు, చెప్పాలంటే వీరాభిమానులు ఉన్న క్రికెటర్ ఎవరు అంటే పెర్రి పేరు అందరికంటే ముందు తడుతుంది.ఆమె అందం అలాంటిది.మోడలింగ్ నుంచి క్రికెట్ కి వచ్చిందా అనుకుంటారు చాలామంది.ఆమె అందానికి క్రికెట్ ప్రపంచం దాసోహం.మగ క్రికెటర్ లానే, ఈవిడకి పెద్ద పెద్ద స్పాన్సర్స్ ఉన్నారు.యాడ్స్ కూడా చేస్తుంది.

చెప్పాలంటే మహిళా క్రికెటర్ కి సూపర్ స్టార్.మరి కేవలం అందంతోనే ఇంత పేరు సంపాదించిందా అంటే అలా కాదు.నెం.1 ఆల్రౌండర్.ఇటు బ్యాటింగ్ లో ఎలా విరుచుకుపడుతుందో, అటు బౌలింగ్ లోనే అదే మాదిరి చుక్కలు చూపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube