పెద్ద పెద్ద గాయాలు అయితే వెంటనే వైద్యం అందవలసిన అవసరం ఉంది.కానీ చిన్న చిన్న గీతలను సులభంగా సహజమైన ఇంటి నివారణలతో నయం చేసుకోవచ్చు.
మచ్చలు మరియు అంటువ్యాధుల అభివృద్ధి ప్రమాదం తగ్గించేందుకు గీతలను మరియు కోతలను శుభ్రంగా మరియు పొడిగా ఉంచాల్సిన అవసరం ఉంది.మనకు వంటగదిలో సులభంగా అందుబాటులో ఉండే పదార్ధాలు గాట్లను నయం చేయటంలో సహాయపడతాయి.ఒకవేళ ఇంటి నివారణలతో నయం కాకపోతే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.
1.వెల్లుల్లి
వెల్లుల్లి గీతలు, పుళ్ళు మరియు కోతలను నయం చేయటంలో పురాతన కాలం నుండి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ఒక అద్భుతమైన మైక్రోబియల్ ఏజెంట్ ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ నుండి రక్షించటానికి సహాయపడుతుంది.
అయితే వెల్లుల్లి కొంత చికాకును కలిగిస్తుంది.ఒక కప్పు వైన్ లో మూడు వెల్లుల్లి రెబ్బలను వేసి బాగా కలిపి రెండు నుండి నాలుగు గంటల తర్వాత వడగట్టాలి.
ఈ ద్రవాన్ని రోజులో కొన్ని సార్లు గాయానికి రాస్తే మంచి పలితం కనపడుతుంది.ఒకవేళ చికాకు దీర్ఘకాలం ఉంటే కనుక ఈ నివారణ చేయటం ఆపేయాలి.
2.కలబంద
కలబంద నుండి తీసిన జెల్ గీతల చికిత్సలో అద్భుతంగా పనిచేస్తుంది.మొదట గీతలను శుభ్రం చేసి ఆ తర్వాత కలబందను చర్మం మీద సమంగా రాయాలి.గీతలోకి వ్యర్ధాలు మరియు తేమ ప్రవేశించకుండా కలబంద సహాయపడుతుంది.అంతేకాక నొప్పి నుండి ఉపశమనం కలిగించటమే కాకుండా నయం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.గీతలను నయం చేయటానికి రోజులో అనేక సార్లు ఈ విధంగా చేయాలి.
3.తేనె
తేనే గీతలను నయం చేయటంలో చాలా ప్రభావవంతంగా పనిచేసే ఇంటి నివారణలలో ఒకటిగా ఉన్నది.తేనెలో బాక్టీరియా సమ్మేళనాలు ఉండుట వలన ఇన్ ఫెక్షన్స్ ఎదుర్కోవటంలో సహాయం మరియు తేమను నిరోదించటానికి సహాయపడతాయి.ముందుగా గాట్లు మరియు గాయాలను శుభ్రం చేయాలి.ఆ తర్వాత ప్రభావిత ప్రాంతం మీద తేనెను రాయాలి.గాయం నయం అయ్యేవరకు ఈ విధంగా చేయాలి.
4.పెట్రోలియం జెల్లీ మరియు పంచదార
పెట్రోలియం జెల్లీ మరియు పంచదార కలిపి ఉపయోగిస్తే గాట్లు మరియు గీతలు తగ్గుతాయి.
ఇవి ఇన్ ఫెక్షన్స్ ని అడ్డుకోవటమే కాకుండా నయం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తాయి.మొదట గాయం మీద పెట్రోలియం జెల్లీ రాసి దాని మీద పంచదార జల్లాలి.
ఆ తర్వాత కట్టు కట్టాలి.గాయం తగ్గేవరకు ప్రతి రోజు ఇదే విధంగా చేయాలి.