అమ్మాయిలతో మాట్లాడటం ఒక ఆర్ట్.అది అందరికి వచ్చేది కాదు.
అందుకే ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలే ఎక్కువ జరుగుతున్నాయి.ఈ కాలంలో అమ్మాయిల మీద ఓ ఇంప్రెషన్ పడేయటానికి పెద్దగా సమయం పట్టడం లేదు, కాని ఆ ఇంప్రెషన్ ని తమ మాటల ద్వారా కాపాడుకోవడమే కష్టం.
మీ మాటల ద్వారానే అమ్మాయి ఒక ఇంప్రెషన్ ని మెయింటేన్ చేస్తుంది.అందుకే మాటల అల్లిక బాగా ఉండాలి.
అమ్మాయికి విసుగు పుట్టకూడదు.ఇంకొంచెం సేపు ఈ అబ్బాయితో మాట్లాడితే బాగుండు అనిపించాలి.
అలా అనిపించాలంటే ఈ 5 లక్షణాలు మీ మాటల్లో ఉండాలి.
* ఎంతసేపు మీ గురించే మాట్లాడకూడదు.
ఈరోజు ఈ పని చేసాను.రేపు ఆ పని చేస్తాను.
నేను అది, నేను ఇది.నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం లేదు.ఎంతసేపు మీ గురించి, మీ ఇష్టాల గురించేనా ? ఇలా మాట్లాడే మగవారినే Self Obsessed గా గుర్తిస్తారు అమ్మాయిలు.ఇలాంటి అబ్బాయిలకి ఈగో ఉన్నా లేకున్నా, వారికి ఈగో ఉంది అనుకుంటారు.
అలాంటప్పుడు మీ మాటలు మీద ఆసక్తి సన్నగిల్లుతుంది.తన గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి.
* తన రోజు ఎలా గడిచింది తెలుసుకోండి.పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెబుతూ ఈరోజు ఏం చేయబోతోందో అడగండి.
ఏదైనా పనిలో మీరు సహాయం చేయొచ్చో లేదో తెలుసుకోండి.ఒకే అంటే వెళ్లి సహాయం చేయవచ్చు.
ఇంప్రెషన్ పెరిగేది ఇలానే.అలాగే రాత్రి అయితే ఆ రోజు ఎలా గడిచిందో అడగండి.
దాంతో తానంటే మీకు చాలా పట్టింపు అని అర్థం అవుతుంది.కేర్ తీసుకునే అబ్బాయితో మాట్లాడటం ఏ అమ్మాయికైనా ఆసక్తికరంగానే ఉంటుంది.* రిలేషన్ షిప్ లోకి ఎంటర్ కాకముందు మీరేమి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వనక్కరలేదు.కనీసం ఓ డ్రెస్ కొనివ్వనక్కరలేదు.తన డ్రెస్ బాగుంది అంటే చాలు.ఈరోజు ఎందుకు చాలా అందంగా కనిపిస్తున్నావ్ అంటూ అప్పుడప్పుడు కాంప్లిమెంట్స్ వదిలితే చాలు.
పొగడ్తలు ఏ అమ్మాయికి నచ్చవు చెప్పండి ? కాని పొగడ్తల్లో కూడా అతి చేయకూడదు.ఎక్కువ చేస్తే మీరు చేసేది ఒవర్యాక్షన్ అని అర్థమయిపోతుంది.
అలాగే ఆమె మూడ్ ని బట్టి, మూడ్ స్వింగ్ ని బట్టి మాటలు ఉండాలి.
* మీ మాటల్లో అప్పుడప్పుడు తన కుటుంబం గురించి, వారి బాగోగుల గురించి అడగండి.
ఇలా ఓ అబ్బాయి అడిగితె ఓ అమ్మాయికి స్పెషల్ ఫీల్ కలుగుతుంది.ఓ జెంటిల్మెన్ గా కనిపిస్తాడు అబ్బాయి.
అలాంటి అబ్బాయిల మాటలు నిజంగానే వినేందుకు ఇష్టపడతారు అమ్మాయిలు.
* ఊరికే ప్లేన్ గా మాట్లాడొద్దు.90% అమ్మాయిలకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండే అబ్బాయిలతో మాట్లాడటం ఇష్టం.కాబట్టి ఫన్నిగా ఉండండి.
కొన్ని జోకులు కలపండి, కొన్ని మీపైన వేసుకోండి.ఎం చేసైనా, మీ మాటల్లో హ్యూమర్ ఉండాలి.
కాని ఆ హ్యూమర్ ఇబ్బందికరంగా ఉండకూడదు.ఆహ్లాదకరంగా ఉండాలి.
ఈ అయిదు లక్షణాలు ఉంటే చాలు .ఒక అమ్మాయికి మీ మాటలేప్పుడు బోర్ కొట్టవు.