మహేష్ బాబు బాగా బీజీగా ఉన్నాడు.పొద్దంతా భరత్ అనే నేను షూటింగ్ లో పాల్గొంటూ, రాత్రంతా స్పైడర్ షూటింగ్ లో ఉంటున్నాడు.
మరి ఏం చేస్తాడు, ఏడాది క్రితం మొదలుపెట్టిన సినిమా ఇప్పటికీ పూర్తి కాకపోతే.హైటెక్ సీటీ ప్రాంతంలో రాత్రిళ్ళు స్పైడర్ కి సంబంధించిన ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తున్నారు.
ఈ చిన్న సీన్ పూర్తయితే టాకీ పార్ట్ మొత్తం అయిపోయినట్టే.జులై మొదటివారంలో ఓ మాస్ పాటను 80 డ్యాన్సర్లతో చిత్రీకరిస్తారట.
ఆ తరువాత మిగిలుండే మరో పాటను కుదిరితే జులై చివరి వారంలో లేదంటే ఆగష్టు మొదటివారంలో షూట్ చేస్తారు.ఎటుచేసి మరో నెల రోజుల్లో స్పైడర్ షూట్ మొత్తం పూర్తయిపోతుంది.
Vfx వర్క్స్, రెండు భాషల్లో డబ్బింగ్, ఎడిటింగ్ వర్క్ ఇంకా మిగిలే ఉంటాయి కాని సినిమా దసరా సీజన్ కి సిద్ధం అవడం ఖాయమని తెలుస్తోంది.తెలాల్సింది విడుదల తేదే.
అయితే ఈ విడుదల తేది విషయంలోనే మహేష్ కి – మురుగదాస్ కి మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్నాయని, ఇద్దరి ఓ పంతం మీద నిలబడ్టారని, ఎవరి పంతం నెగ్గతుందో, ఈ గొడవ ఎప్పుడు ఆగిపోతుందో అని ఎదురుచూస్తున్నారు ప్రిన్స్ అభిమానులు.ఇంతకీ ఆ గొడవ ఏమిటి అంటే …
సెప్టెంబరు 22న సినిమాని విడదల చేద్దాం అని మహేష్.
కాదు సెప్టెంబర్ 27వ తేదిన విడుదల చేద్దాం అని మురుగదాస్.ఓపెనింగ్స్ ఎలాగో అదిరిపోతాయి, రెండొవ వారంలో దసరా పండగ వాతావరణం ఉంటుంది, మొదటిరోజు నుంచే దసరా సెలవులు చేతిలో ఉంటాయని మహేష్ ప్లాన్.27 వస్తే పండగ వాతావరణంలో ఓపెనింగ్స్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి, 27 నుంచి అక్టోబరు 2, గాంధీజయంతి వరకు దిమ్మతిరిగే ఓపెనింగ్స్ వస్తాయని మురుగుదాస్ ప్లాన్.మహేష్ కి ఏమో సెలవులన్ని కావాలి, రెండోవారంలో కూడా సినిమాకి సెలవులు ఉపయోగపడాలి.
మురుగదాస్ కి ఏమో ఓపెనింగ్స్ ఎవరు ఊహించని రీతిలో ఉండాలి, టాక్ వస్తే మహేష్ రెండవవారు ఈజీగా లాగేస్తాడు అని అలోచన.మరి ఇద్దరిలో ఎవరు నెగ్గుతారో!
.