తల్లి పాలు పట్టడమే బిడ్డకి ఆరోగ్యం.అలాగే పాలు పట్టడం తల్లికి కూడా ఆరోగ్యం.
కాని పోషకాలు అందిచే పాలు ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్ ని కూడా అందిస్తాయి.ముఖ్యంగా పాలలోంచి రక్తం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ముందు పాలు పట్టడం మానేసి, రక్తం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి.పాలలో రక్తం రావడం సహజమైన విషయం కాదు.
కొన్నిసార్లు ప్రమాదకరమైన సమస్యల వలన ఇలా జరుగుతుంది, కొన్ని కేసుల్లో హార్మోన్స్ వలన జరుగుతుంది.ఎలా జరిగన ముందు కారణం తెలుసుకోవాలి.
అందుకే ఓ 5 కారణాలు మీకు చెబుతున్నాం.
* చనుమొనలు పగలడం లేదా గాయాలు అవడం వలన పాలలో రక్తం రావొచ్చు.
చనుమొనలు ఎలా పగులుతాయి అంటే అయితే ఇన్ఫెక్షన్ వలన కావచ్చు లేదంటే తల్లి బిడ్డను పాలుపట్టేటప్పుడు సరిగా హ్యాండిల్ చేయకపోవడం వలన కావచ్చు.కాబట్టి పాలు పట్టేటప్పుడు బిడ్డను సరిగా హ్యాండిల్ చేయాలి.
* రొమ్ములో ఉండే చిన్న నాళాలు దెబ్బతినడం వలన కూడా పాలలో రక్తం రావొచ్చు.ఈ నాళాలు ఒత్తిడి వలన పగులుతాయి.
కొందరు తల్లులు బిడ్డకు పాలు మొత్తం అందాలని చివర్లో రోమ్మలపై చేత్తో ఒత్తిడి తీసుకొస్తారు.అలాంటి సమయంలో కాని బిడ్డ పాలు తాగుతున్నప్పుడు బలప్రయోగం చేయడం వలన కాని ఈ నాళాలు దెబ్బతింటాయి.
* మస్తిటిస్ అనే ఇన్ఫెక్షన్ వలన కూడా రొమ్ముపాలలో రక్తం వస్తుంది.ఇది సాధారణంగా పాలు పట్టని స్త్రీలకు వస్తుంది.
అంటే ఆఫీసుకి వెళుతూ బిడ్డకు తల్లిపాలు పట్టని స్త్రీలు ఉంటారుగా అలాంటివారు విరామాలు తీసుకుంటూ పాలు పట్టినప్పుడు ఇలా జరగోచ్చు.లేదంటే తల్లి తాను తాగే పాలు సరిగా లేకపోయినా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది.
* 30 ఏళ్ళు దాటిన మహిళలకు ఫైబ్రోసిస్టిక్ రొమ్ము అనే సమస్య వచ్చి రక్తం కలుషితమై, అదే రక్తం పాల ద్వారా బిడ్డకు చేరుతుంది.ఇది తల్లికి, బిడ్డకి ఇద్దరికీ మంచిది కాదు.
కాబట్టి వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
* రస్టి పైప్ సిండ్రోం .పేరు అదోలా ఉంది కదా ఇదో గంభీరమైన సమస్య అనుకునేరు.మొదటి కాన్పు సమయంలో చాలామందికి మహిళలకి వచ్చే ఓ సాధారణ సమస్యే.
ఇందులో రస్టి పైప్ నుంచి వచ్చే నీరు రంగు మారి రక్తంలా కనిపిస్తుంది.ఇది త్వరగానే తగ్గిపోతుంది.







