సూసైడ్ చేసుకొమ్మని బాయ్ ఫ్రెండ్ ని బలవంతం చేసిన గర్ల్ ఫ్రెండ్ .. ఆ తరువాత ఏమయ్యిందంటే

కేవలం భార్యాభర్తల మధ్యనే కాదుగా, లవర్స్ మధ్య కూడా ఎన్నో గొడవలు జరుగుతాయి.

గొడవలతో బ్రేక్ అప్ చెప్పేసుకున్న లవర్స్ గురించి విన్నాం, కోపంతో గర్ల్ ఫ్రెండ్ ని బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ని గర్ల్ ఫ్రెండ్ మర్డర్ చేయడం గురించి కూడా విన్నాం.

కాని ప్రపంచంలో ఎక్కడ చూడని ఓ వింత కేసు గురించి వివరంగా చెబుతున్నాం చదవండి.ఇలాంటి వింత కేసు మీరు మళ్ళీ చూడరేమో.

అమ్మాయి పేరు మిషేలి కార్టర్.అబ్బాయి పేరు లిన్ రాయ్.

అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని సూసైడ్ చేసుకొమ్మని బలవంతం చేసింది.రాయ్ వయసు అప్పుడు 18.మిషేలి వయసు 17.మూడు సంవత్సరాల క్రితం నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి, చేసుకోవాల్సిందే, ఇక వాయిదా వేయొద్దు అంటూ మూడు వందలకు పైగా మెసేజ్లు పెట్టింది కార్టర్.ఆ అబ్బాయికి ఎప్పుడో ఒకప్పుడు సూసైడ్ చేసుకునే ఆలోచన ఉన్నా, దాన్ని విరమించుకున్నాడు.

Advertisement

నేను చేసుకొను అంటూ ఈ అమ్మాయి పంపిన మెసేజ్లకు సమాధానం కూడా ఇచ్చాడు.కాని కార్టర్ ఒత్తిడి పెంచింది.తాను సూసైడ్ చేసుకోవాల్సిందే అనే స్టేజికి తీసుకొచ్చింది.

అసలు కారణం ఏమిటి ? పోలీసులకి దొరికిన చాట్ కన్వర్సేశన్స్ లో ఎక్కడా కూడా ఇద్దరి మధ్య గొడవ కనబడలేదు.పైగా చివరిసారి పెట్టుకున్న కొన్ని మెసేజ్లలో ఇద్దరు ఒకరికి ఒకరు పదే పదే "ఐ లవ్ యూ" అంటూ చెప్పుకున్నారు.

రాయ్ చనిపోవాలని కార్టర్ కి ఎందుకు అనిపించిందో.తానూ ఆత్మహత్య చేసుకోవాల్సిందే అని ఆ అబ్బాయికి ఎందుకు అనిపించిందో, ఆ అమ్మాయి చెప్పినట్టే మూడు సంవత్సరాల క్రితం, జులై 12, 2014 రోజునా సరిగ్గా ఆ అమ్మాయి చెప్పినట్టే కారులో కార్బన్ డియాక్సైడ్ పాయిజన్ చేసుకొని చనిపోయాడు.ఈ వింత చూసి కోర్టు పోలీసులు బిత్తరపోయారు.

ఓ వ్యక్తిని ఆత్మహత్య చేసుకొమ్మని ప్రేరేపించడం మొదటిసారి చూసారు.అందుకే కేసు మీద తుది తీర్పు వెల్లడించడానికి మూడేళ్ళ సమయం పట్టింది.

మొత్తానికి తీర్పు చెప్పారు.అమ్మాయికి 20 ఏళ్ల జైలు శిక్ష వేస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

ఈ తీర్పు పట్ల ఆ అబ్బాయి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేసారు.కార్టర్ విచారణలో పెద్దగా ఏమి మాట్లాడలేదట.

Advertisement

ఆద్యంతం ఏడుస్తూ ఉందట.

తాజా వార్తలు