దర్శకుడి వయసు 43, అతని కొత్త గర్ల్ ఫ్రెండ్ వయసు 22

బాలివుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఏం చేసిన సంచలనమే.ఎవరు తిట్టుకున్నా, ఎన్ని విమర్శలు వచ్చినా, తనకి నచ్చిందే మాత్రమే చేస్తాడు ఈ డేరింగ్ డైరెక్టర్.

 Director’s Age Is 43 And His New Girlfriend Is Just 22-TeluguStop.com

సినిమాల్లో ప్రతి సీన్ కి ఓ బండబూతు రాస్తాడు.అదో స్టయిల్.

ఎవరు ఊహించలేని విధంగా హింసాత్మక సీన్లు, శృంగార సీన్లు తీస్తాడు, చివరకి లెస్బియన్ కిస్సింగ్ సీన్లు కూడా పెడతాడు.అంతా తన ఇష్టం, చూస్తే చూడండి, లేదంటే మానేయ్యండి అంటాడు.

అందుకే బాలివుడ్ లో అనురాగ్ ని జూనియర్ రామ్ గోపాల్ వర్మ అని అంటారు.ఇప్పుడు ఈ జూనియర్ ఆర్జీవి ఏం చేసాడో తెలుసా? కొత్త గర్ల్ ఫ్రెండ్ ని పట్టుకున్నాడు.అది కూడా తనకన్నా, 21 ఏళ్ళు తక్కువున్న అమ్మాయిని.

Director's age is 43 and his new girlfriend is just 22 Director’s Age Is 4అనురాగ్ వయసు 43.తన కొత్త గర్ల్ ఫ్రెండ్ వయసు 22.చిత్రమైన విషయం ఏమిటంటే అనురాగ్ కి 16 ఏళ్ళ కూతురు ఉంది.ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ పేరు శుభ్ర షెట్టి.తన గర్ల్ ఫ్రెండ్ తో దిగిన ఫోటోలు తానే స్వయంగా పోస్ట్ చేస్తున్నాడు అనురాగ్.సెల్ఫీల నుంచి బెడ్ రూమ్ ముచ్చట్ల వరకు, అన్ని సోషల్ మీడియాలో పెడుతోంది ఈ జంట.వీరు గనుక పెళ్ళి చేసుకుంటే ఇది అనురాగ్ కి మూడొవ పెళ్ళి అవుతుంది.

2003లో ఆర్తి అనే అమ్మాయిని పెళ్ళి చేసుకోని ఓ కూతురిని కన్న అనురాగ్, ఆమెకి విడాకులు ఇచ్చి 2011లో బాలివుడ్ హీరోయిన్ కల్కీ కొచ్చిన్ ని పెళ్ళాడాడు.నాలుగేళ్ళ తరువాత ఈ జంట కూడా విడాకులు తీసుకుంది.

ఇప్పుడు చిన్న గ్యాప్ తరువాత ఇలా ఎవరు ఊహించని విధంగా చాలా అంటే చాఆ యంగ్ గర్ల్ ఫ్రెండ్ ని మేయింటేన్ చేస్తున్నాడు అనురాగ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube